'క్రాక్' ఫైనల్ షెడ్యూల్ స్టార్ట్ చేసిన మాస్ మహారాజా...!
'క్రాక్' ఫైనల్ షెడ్యూల్ స్టార్ట్ చేసిన మాస్ మహారాజా...!

మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘క్రాక్’. రవితేజ కెరీర్లో 66వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు. వీరి కాంబినేషన్ లో ఇంతకముందు వచ్చిన ‘డాన్ శీను’ ‘బలుపు’ చిత్రాలు మంచి విజయాలను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ‘క్రాక్’ తో హ్యాట్రిక్ హిట్ కోసం రెడీ అవుతున్నారు. రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ – వరలక్ష్మీ శరత్ కుమార్ – సముద్రఖని ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మేజర్ పార్ట్ షూటింగ్ జరుపుకున్న ‘క్రాక్’ చిత్రాన్ని సమ్మర్ లో విడుదల చేయాలని భావించినప్పటికీ.. కరోనా కారణంగా షూటింగ్ నిలిచిపోయింది. అయితే దాదాపు ఏడు నెలల తర్వాత ‘క్రాక్’ షూటింగ్ తిరిగి ప్రారంభం అయింది.
కాగా ‘క్రాక్’ మూవీ షూటింగ్ హైదరాబాద్ లోని రామోజీ ఫిలింసిటీలో స్టార్ట్ చేశారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ చిత్రీకరణ జరపనున్నారు. కొంత భాగం షూటింగ్ మాత్రమే మిగిలి ఉండగా ఈ ఫైనల్ షెడ్యూల్ లో అది పూర్తి చేయనున్నారు. ఆ తరువాత రెగ్యులర్ గా మూవీ సాంగ్స్ ట్రైలర్ రిలీజ్ చేస్తూ ప్రమోషన్లను ప్రారంభించాలని మేకర్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పటికే విడుదలైన ‘క్రాక్’ ఫస్ట్ లుక్ మరియు టీజర్ విశేష స్పందన తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో షూటింగ్ స్టార్ట్ అయిందని వెల్లడిస్తూ లేటెస్ట్ గా కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని సరస్వతి ఫిల్మ్ డివిజన్ ప్రొడక్షన్స్ లో ఠాగూర్ మధు నిర్మిస్తున్నాడు. థమన్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నాడు. ‘మెర్షల్’ ‘బిగిల్’ వంటి చిత్రాలకు వర్క్ చేసిన సినిమాటోగ్రాఫర్ జీకే విష్ణు ‘క్రాక్’ చిత్రం కోసం పని చేస్తున్నారు. ఇక అక్టోబర్ 15 నుంచి దేశవ్యాప్తంగా సినిమా థియేటర్స్ తెరుచుకునేందుకు కేంద్రం అనుమతిని ఇచ్చిన నేపథ్యంలో ‘క్రాక్’ థియేటర్ లలో విడుదల కానుంది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here