సర్కారు వారి పాటలో క్లాస్ మాస్ రెండు లుక్స్
సర్కారు వారి పాటలో క్లాస్ మాస్ రెండు లుక్స్

సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఏడాది టాలీవుడ్ నుండి వచ్చిన మూడు నాలుగు హిట్స్ లో మహేష్ బాబు మూవీ ఒకటి. ఇక వచ్చే ఏడాది మరో సూపర్ హిట్ ను ఇచ్చేందుకు మహేష్ బాబు సరికొత్తగా కనిపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడట. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం మహేష్ బాబు తదుపరి సినిమా సర్కారు వారి పాట లో రెండు విభిన్నమైన గెటప్స్ లో కనిపించబోతున్నాడట. ఒకటి క్లాస్ లుక్ కాగా మరోటి మాస్ లుక్ గా ప్రచారం జరుగుతోంది.
బ్యాంకింగ్ రంగంలో మోసాలను బయట పెట్టేందుకు తాను ఒక మోసగాడిగా మహేష్ బాబు మారతాడట. అందుకోసం అతడి మాస్ లుక్ అందరిని ఆకట్టుకుంటుంది. ఇక ఎప్పటిలాగే మహేష్ క్లాస్ లుక్ లో కూడా కనిపించబోతున్నాడు. కథానుసారంగా రెండు విభిన్నమైన గెటప్ లలో కనిపించబోతున్న మహేష్ బాబు రెండు లుక్స్ మద్య చాలా వేరియేషన్ ను మెయింటెన్ చేయబోతున్నారట. లుక్ విషయంలో ఇప్పటికే స్కెచ్చులు రెడీ అయ్యాయి. ఒక లుక్ కు గాను గడ్డం మీసాలు ఉంటాయి. మరో లుక్ లో క్లీన్ షేవ్ తో కనిపించబోతున్నాడు.

రెండు లుక్స్ కూడా వేటికి అవే అన్నట్లుగా విభిన్నంగా ఉండి ఆకట్టుకుంటాయట. వచ్చే నెల నుండి సర్కారు వారి పాట సినిమా షూటింగ్ అమెరికాలో జరుగబోతుంది. దాదాపు నెలన్నర పాటు షూటింగ్ అక్కడ జరిపి వచ్చే ఏడాది జనవరిలో అమెరికా నుండి ఇండియాకు తిరిగి రాబోతున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ విషయంలో నెలకొని ఉన్న సస్పెన్స్ కు త్వరలో ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం ఉందనిపిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here