పెళ్లి చేసుకొని దాచిపెట్టి బుల్లితెర స్టార్
పెళ్లి చేసుకొని దాచిపెట్టి బుల్లితెర స్టార్

కరోనా టైంలో ఏదీ ప్రశాంతంగా చేసుకునే సౌలభ్యం లేకుండా పోయింది. పెళ్లిళ్లు కూడా నిండా 50 మంది కూడా లేకుండా చేసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే కోవిడ్ నిబంధనలతో ఎక్కడ అభాసుపాలు అవుతామో కేసుల బారిన పాడుతామో అని ఓ హీరోయిన్ కం బుల్లితెర స్టార్ గా మారిన నటి అందరికీ షాకింగ్ విషయం చెప్పింది.
తనకు పెళ్లి ఆగస్టులోనే అయ్యిందని.. కరోనా కారణంగా ఎవరికి చెప్పలేదని.. తన భర్త ఇతడే అని అందరికీ సోషల్ మీడియాలో పెళ్లి వీడియో షేర్ చేసి షాకిచ్చింది.

‘మేము వయసుకు వచ్చాం’ సినిమాలో తనీష్ కు జోడీ హీరోయిన్ గా నటించింది నీతి టేలర్. ఆ సినిమా సోసోగా ఆడింది. ఆ తర్వాత‘పెళ్లి పుస్తకం’లోనూ హీరోయిన్ గా నటించింది. సినిమా అవకాశాలు రాకపోవడంతో బుల్లితెరకు షిఫ్ట్ అయ్యింది. బుల్లితెర టెలివిజన్ స్టార్ గా ప్రేక్షకుల అభిమానాన్ని నీతి చూరగొంది.
ఈ క్రమంలోనే తన జీవితంలోనే అత్యంత ముఖ్యమైన ఘట్టమైన పెళ్లిని కూడా దాచేసింది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో తాను కోవిడ్ నిబంధనల మేరకు ఆగస్టు 13న పరిక్షిత్ ను కుటుంబ సభ్యుల మధ్య వివాహం చేసుకున్నానని వివరించింది.
అభిమాన బుల్లితెర నటి ఇలా పెళ్లి చేసుకుందని తెలియగానే అందరూ షాకయ్యారు. కరోనా తగ్గిన తర్వాత అందరికీ రిసెప్షన్ ఇస్తానని నీతి చెప్పుకొచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here