చిన్నారులకు హార్ట్ సర్జరీలు.. ముగ్గురు టాలీవుడ్ మేనేజర్లకు సోనూ సూద్ సాయం
చిన్నారులకు హార్ట్ సర్జరీలు.. ముగ్గురు టాలీవుడ్ మేనేజర్లకు సోనూ సూద్ సాయం

ప్రముఖ నటుడు సోనూ సూద్ ఈ లాక్‌డౌన్ సమయంలో తన అసాధారణ సామాజిక సేవతో రియల్ హీరో అనిపించుకున్నారు. కష్టాల్లో ఉన్న చాలా మందిని ఆయన ఆదుకున్నారు. ముఖ్యంగా వలస కార్మికుల పాలిట దైవంగా నిలిచారు. ఇప్పటికీ ట్విట్టర్ ద్వారా ఎవరైనా సాయం కోరితే వారి వివరాలు తెలుసుకొని సాయం అందిస్తున్నారు. అయితే, చిన్న పిల్లలకు గుండె శస్త్రచికిత్సలు కూడా చేయిస్తానని ఇటీవల ప్రకటించిన సోనూ.. ఇప్పటికే చాలా మంది చిన్నారులకు సర్జరీలు చేయించారు. అయితే, ఈ చిన్నారుల్లో టాలీవుడ్ మేనేజర్లకు చెందిన పిల్లలు కూడా ఉండటం విశేషం.

తెలుగు సినీ పరిశ్రమలో మేనేజర్‌గా పనిచేస్తున్న ఎంవీ సుబ్బారావు తన రెండేళ్ల కుమారుడికి హార్ట్ ప్రాబ్లమ్ ఉందని సోనూ సూద్‌కు ట్వీట్ చేశారు. తన బాబుకి వెంటనే సర్జరీ చేయాలని డాక్టర్లు సూచించారని పేర్కొన్నారు. సర్జరీకి సరిపడ డబ్బు తన వద్ద లేదని.. దయచేసి తన కుమారుడి ప్రాణాలను కాపాడాలని ట్విట్టర్ ద్వారా సోనూ సూద్‌ను వేడుకున్నారు. సుబ్బారావు ట్వీట్‌కు స్పందించిన సోనూ సూద్.. ‘‘బుధవారం మీ బాబుకి పరీక్షలు నిర్వహిస్తారు. గురువారం ముంబైలోని ఎస్ఆర్‌సీసీ హాస్పిటల్‌లో మీ బాబుని చేర్చుకుంటారు. సర్జరీ నిర్వహిస్తారు’’ అని అభయమిచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here