ప్లాప్ మూవీని గుర్తు చేసుకున్న మహేష్.. 'త్వరలో మరో సినిమా' అంటూ ట్వీట్...!
ప్లాప్ మూవీని గుర్తు చేసుకున్న మహేష్.. 'త్వరలో మరో సినిమా' అంటూ ట్వీట్...!

టాలీవుడ్ లో కొన్ని కాంబినేషన్స్ కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. అవి హిట్టా ఫట్టా అన్నది పక్కన పెడితే వారి కాంబోలో సినిమా పడితే చాలు అని అభిమానులు కోరుకుంటారు. అలాంటి వాటిలో  సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ ఒకటి. వీరి కలయికలో ముందుగా ‘అతడు’ సినిమా వచ్చి సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత ఎన్నో అంచనాలతో వచ్చిన ‘ఖలేజా’ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. అయితే వెండితెరపై ఆకట్టుకోలేకపోయిన ‘మహేష్ ఖలేజా’.. బుల్లితెరపై మాత్రం సూపర్ హిట్ అయింది. ఈ సినిమా మహేష్ బాబులోని మరో కోణాన్ని ఆవిష్కరించింది. మహేష్ లోని కామెడీ యాంగిల్ బయటకి తీసిన సినిమా అని చెప్పవచ్చు. అందుకే ఈ సినిమా ఎప్పుడు టీవీలో ప్రసారం అయినా మంచి ఆదరణ తెచ్చుకుంటుంది. అందుకే మహేష్ ఫ్యాన్స్ త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో మూవీ చేస్తే బాగుండు అని కోరుకుంటారు. ‘ఖలేజా’ మూవీ విడుదలై నేటికి 10 ఏళ్ళు అవుతోంది. ఈ నేపథ్యంలో మహేష్ బాబు నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నాడు.
మహేష్ ‘ఖలేజా’ సినిమా గురించి ట్వీట్ చేస్తూ షూటింగ్ కు సంబంధించిన ఓ వీడియోని షేర్ చేశాడు. ”ఖలేజాకు 10 ఏళ్లు! నటుడిగా నన్ను కొత్తగా ఆవిష్కరించింది !! ఎప్పటికీ నాకు ప్రత్యేకమైనదిగా మిగిలిపోతుంది !! నా బెస్ట్ ఫ్రెండ్ బ్రిలియంట్ డైరెక్టర్ త్రివిక్రమ్ కు ధన్యవాదాలు. మా నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం ఎదురుచూస్తున్నాము.. అతి త్వరలో” అని ట్వీట్ లో పేర్కొన్నాడు మహేష్. వీరి కాంబోలో నెక్స్ట్ సినిమా అతి త్వరలో రానున్నదని.. దాని కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని మహేష్ చెప్పడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఇక ‘ఖలేజా’ విషయానికొస్తే ఈ సినిమాలో మహేష్ సరసన అనుష్క నటించింది. ఇందులో మహేష్ టాక్సీ డ్రైవర్ గా కనిపించాడు. సింగనమల రమేష్ బాబు – సి. కళ్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేక ప్లాప్ సినిమాగా మిగిలిపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here