షూటింగ్లో ఉన్న నటికి దయ్యం పట్టింది.. సినిమా యూనిట్ పరుగులు
షూటింగ్లో ఉన్న నటికి దయ్యం పట్టింది.. సినిమా యూనిట్ పరుగులు

ఈ మధ్య దయ్యాల సినిమాలకు మంచి గిరాకీ ఉంది. దీంతో ప్రతి నిర్మాత దర్శకుడు ఇటువంటి కథలపైనే ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే ఇటీవల ముంబైలోని ఓ పాడుబడ్డ భవంతిలో ఓ థ్రిల్లర్ సినిమాను తెరకెక్కిస్తుండగా..  ఉన్నట్టుండి హీరోయిన్ వింతగా ప్రవర్తించింది. మగ గొంతుతో మాట్లాడుతూ రెచ్చిపోయింది. దీంతో ఈ సినిమా యూనిట్‌కు భయం పట్టుకుంది. వెంటనే అక్కడి నుంచి పరుగులు తీశారు. ఆ నటికి నిజంగానే దయ్యం పట్టిందని భావించి వారంతా హడలెత్తి పోయారు.  ఇక అప్పటి నుంచి ఆ ప్రదేశం లో షూటింగ్ అంటేనే సినీ నిర్మాతలు భయపడుతున్నారు. ఇంతకు ఆ ప్లేస్ ఏదంటే ముంబై శివారు లో ఉన్న ‘ముఖేశ్ మిల్స్’ ఆ పేరు చెబితేనే ముంబై లోని సినిమా వాళ్లంతా వణికి చస్తారు. అయితే ఈ ప్లేస్ చాలా భయానకంగా ఉండటంతో ఇప్పటికే అక్కడ చాలా సినిమాలను చిత్రీకరించారు. దీంతో అక్కడ తరుచూ షూటింగ్స్ జరుగుతూ ఉండేవి.
కానీ ఇటీవల వెళ్లిన ఓ చిత్ర యూనిట్‌కు మాత్రం చుక్కలు కనిపించాయి. ఆ సినిమాలో నటిస్తున్న ఓ నటి.. ఒక్కసారిగా తన స్వరం మగాడిగా మార్చింది. కళ్లు పెద్దవి చేస్తూ సినిమా టీమ్‌కు హెచ్చరికలు చేసింది. వెంటనే ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోవాలని లేకపోతే.. ముప్పు తప్పదని చెప్పింది. ఆ తర్వాత సొమ్మసిల్లి పడిపోవడంతో ఆ రోజు పేకప్ చెప్పి వెళ్లిపోయారు. ఆ తర్వాత మళ్లీ ఎవరూ అక్కడికి వెళ్లలేదు. అయితే ఆ నటి పేరును మాత్రం ఆ టీమ్ వెల్లడించలేదు. అయితే గతంలో ఓ సారి అక్కడ కమ్యా పంజాబీ (సిందూర్ సింగ్) అనే సీరియల్‌ను అక్కడ షూట్ చేశారు.  అయితే ఆ షూటింగ్లో పాల్గొన్న ఓ బాలనటి మాత్రం మగాడి గొంతుతో అరుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోవాలని చిత్ర యూనిట్‌ను హెచ్చరించింది. దీంతో షూటింగ్‌ను నిలిపివేశారు. బాలీవుడ్ నటి బిపాసబసు ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘గుణ్హా’ చిత్రాన్ని ముఖేష్ మిల్స్‌లోనే చిత్రీకరించారు. ఆ ప్రాంతంలో ఏవో వింతశబ్ధాలు వినిపించినట్టు బిపాసా చెప్పారు.

ముంబయిలోని కొలాబా ప్రాంతంలో 1870లో ముఖేష్ మిల్స్ ను   ప్రారంభించారు. 1875 లో దీన్ని మరింత విస్తరించారు. వేలాది మంది ఇక్కడ ఉపాధి పొందేవారు. అయితే 1982లో ఇక్కడ భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకున్నది. దీంతో ఆ భవనం శిథిలావస్థకు చేరుకున్నది. కానీ ముఖేశ్ మిల్స్ ఎంతో అందమైన కట్టడం.. అమితాబ్ బచ్చన్ నటించిన ‘హమ్’ సినిమాలో ‘చుమ్మా చుమ్మా దేదే’ పాటను ఇక్కడే చిత్రీకరించారు. అప్పటినుంచి  ఈ పాడుబడ్డ భవంతిపై బాలీవుడ్ కన్ను పడింది. అడపదడపా ఇక్కడ షూటింగ్ లు చేస్తున్నారు. ఇటీవల హర్రర్ సినిమాలకు గిరాకీ పెరగడం తో అందరి దృష్టి ముఖేశ్ మిల్స్‌పై పడింది. అయితే అక్కడ ఎందుకు వింతశబ్ధాలు వస్తున్నాయి అన్న విషయం మిస్టరీగానే మిగిలిపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here