బాలయ్య కోసం సీనియర్ దర్శకుల పోటీ... ఛాన్స్ ఎవరికి దక్కేనో!
బాలయ్య కోసం సీనియర్ దర్శకుల పోటీ... ఛాన్స్ ఎవరికి దక్కేనో!

టాలీవుడ్‌లో ప్రస్తుతం సీనియర్ దర్శకుల పరిస్థితి దారుణంగా తయారైంది. ట్రెండ్‌ను ఒడిసి పట్టకపోవడంతో పాటు కొత్తతరం దర్శకుల రాకతో వారితో సినిమాలు చేసేందుకు ఏ హీరో ముందుకు రావడం లేదు. వారి కథలకు సెట్ అయిన హీరోలు నో చెబుతుంటే.. ఆస్తకి చూపుతున్న హీరోలు వేరే సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం బోయపాటి శ్రీనుతో సినిమా చేస్తున్న బాలకృష్ణ ఆ తర్వాత ప్రాజెక్టులేవీ ఒప్పుకోలేదు. దీంతో ఆయనతో సినిమా చేసేందుకు ఇద్దరు సీనియర్ దర్శకులు పోటీ పడుతున్నారట. వారెవరో కాదు.. బి.గోపాల్, వి.వి.వినాయక్.

ఈ ఇద్దరు డైరెక్టర్లకు బాలయ్యతో మంచి అనుబంధం ఉంది. ముఖ్యంగా బి.గోపాల్-బాలయ్య కాంబినేషన్లో అప్పట్లో దుమ్మురేపింది. రౌడీ ఇన్‌స్పెక్టర్, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు వంటి ఇండస్ట్రీ హిట్లు సాధించి క్రేజీ కాంబోగా నిలిచారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న బి.గోపాల్ ఆయనతో సినిమా చేసేందుకు రెండేళ్లుగా ప్రయత్నిస్తున్నారు. అయితే బాలకృష్ణ ఇమేజ్‌కు తగ్గ కథ రెడీ చేసుకోకపోవడంతో ఆ ప్రాజెక్టు ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం స్టార్ రైటర్‌గా కొనసాగుతున్న సాయిమాధవ్ బుర్రా చేత ఓ మంచికథ రెడీ చేయించినట్లు సమాచారం. ఆ స్టోరీ లైన్‌పై ఇంట్రెస్ట్ చూపించిన బాలయ్య ఫుల్ స్ర్కిప్ట్ తయారు చేస్తే ప్రాజెక్ట్ పట్టాలెక్కిద్దామని చెప్పారట.

మరోవైపు వి.వి.వినాయక్ కూడా బాలయ్య డేట్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ‘ఆచార్య’లో నటిస్తున్న మెగాస్టార్ చిరంజీవి బాబీ, మెహర్ రమేష్‌లో ఎవరో ఒకరితో సినిమా చేయనున్నారట. ఆయనతో ‘లూసిఫర్’ రీమేక్‌కు వినాయక్ డైరెక్టర్‌గా సెలక్ట్ అయినప్పటికీ అది ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో టైమ్ వేస్ట్ చేసుకోకుండా బాలయ్యతో సినిమా చేసేందుకు ఓ కథ సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. తనకు సన్నిహితులైన ఇద్దరు డైరెక్టర్లలో బాలయ్య ఎవరికి ఛాన్స్ ఇస్తారో వేచి చూడాలి.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here