రమ్యకృష్ణ-ఐశ్వర్య రాజేష్ తో...
రమ్యకృష్ణ-ఐశ్వర్య రాజేష్ తో...

మంచి టాలెంట్ వున్న నటులు ఓ దగ్గర చేరితే కచ్చితంగా సినిమాలో ఏదో విషయం వుందనిపిస్తుంది. పైగా అలాంటి సినిమాకు కాస్త విషయం వున్న డైరక్టర్ పని చేస్తుంటే ఇంకా ఇంట్రస్టింగ్ వుంటుంది. దర్శకుడు దేవా కట్టా గురించి తెలిసిందే.

అలాంటి డైరక్టర్ హీరో సాయి ధరమ్ తేజ్ తో పొలిటికల్ టచ్ వున్న సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో కీలక పాత్రలకు రమ్యకృష్ణ-ఐశ్వర్య రాజేష్-జగపతి బాబులను తీసుకున్నారని బోగట్టా.

పవర్ ఫుల్ పొలిటీషియన్ గా రమ్య, కేవలం గ్లామర్ డాల్ గా కాకుండా, స్టఫ్ వున్న హీరోయిన్ క్యారెక్టర్ లో ఐశ్వర్య రాజేష్, హీరో తండ్రి క్యారెక్టర్ లో జగపతి బాబు కనిపించబోతున్నారు. ఈ కాస్టింగ్ ను బట్టే అంచనా వేసుకోవచ్చు దేవా కట్టా కాస్త పవర్ ఫుల్ సబ్జెక్ట్ తీసుకున్నారని.

ఇదిలావుంటే ఈ సినిమాకు మణిశర్మ సంగీత దర్శకుడు. ఈ నెల 19 నుంచి షెడ్యూలు ప్రారంభించి సుమారు నలబై రోజుల పాటు కంటిన్యూగా షూట్ చేసేస్తారు. ఇంత లెంగ్తీ షెడ్యూలులో దాదాపు సగానికి పైగా సినిమా పూర్తయిపోతుంది. వాస్తవానికి ఈ నెల 12 నుంచి సినిమా స్టార్ట్ కావాల్సింది. కానీ ఎందుకో వారం రోజులు వెనక్కు జరిపారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here