ఇండిగో విమానంలో ఓ మహిళ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విమానం ఢిల్లీ నుంచి బెంగుళూరుకు వెళుతుండగా ఆమె ప్రసవించింది. ఇండిగో విమానం 6ఈ 122 అనే విమానం బుధవారం సాయంత్రం 5.30 గంటలకు ఢిల్లీ నుంచి ఢిల్లీకి బయలుదేరింది. ఈ విమానం బయలుదేరిన కొద్దిసేపటికో ఆ మహిళకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. దీంతో విమాన సిబ్బంది ప్రత్యేక సేవలను అందించగా, 6.10 గంటల సమయంలో బిడ్డను ప్రసవించింది. అదీ నెలలు నిండకుండానే మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఇండిగో ఎయిర్‌లైన్స్ వెల్లడించింది. కాగా, తల్లీ బిడ్డా ఇద్దరూ క్షేమంగానే ఉన్నారు. ఈ విషయాన్ని వెల్లడించిన విమాన కెప్టెన్ క్రిష్టోఫర్, తన విమానంలో ఓ మహిళ, బిడ్డకు జన్మనివ్వడం గర్వంగా ఉందని, వారిద్దరూ క్షేమమేనని ట్వీట్ చేశారు. విమానం 7.30 గంటల సమయంలో బెంగళూరులో ల్యాండ్ కాగానే, తల్లీ బిడ్డలను ఆసుపత్రికి తరలించామని అధికారులు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here