దీపావళి నుంచి సినిమా ప్రదర్శనలు : ఎగ్జిబిటర్స్
దీపావళి నుంచి సినిమా ప్రదర్శనలు : ఎగ్జిబిటర్స్

కరోనా లాక్ డౌన్ కారణంగా గత ఏడు నెలలుగా మూతబడ్డ సినిమా థియేటర్స్ తెరుచుకోడానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 15 నుంచి 50 శాతం ఆక్యుపెన్సీతో సినిమా థియేటర్స్ మల్టీప్లెక్సులు రీ ఓపెన్ చేసుకోమని సూచించింది. ఈ నేపథ్యంలో దీపావళి నుంచి తూర్పు గోదావరి జిల్లా థియేటర్లలో సినిమా ప్రదర్శనలు ప్రారంభించాలని తీర్మానించామని జిల్లా ఫిలిమ్ డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ తెలిపింది. కాకినాడ లక్ష్మీ థియేటర్ లో నిన్న (బుధవారం) జరిగిన జిల్లా ఫిలిమ్ డిస్ట్రిబ్యూటర్స్ – ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ.. ”కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈనెల 15 నుంచి సినిమా ప్రదర్శనలకు అనుమతించడం జరిగింది. అందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల థియేటర్లను వెంటనే తెరవడం సాధ్యం కావడం లేదు. నిర్మాతల సహకారంతో దీపావళికి థియేటర్లు తెరవాలని నిర్ణయించుకున్నాం’ అని తెలిపారు. అలానే సినీ పెద్దల సమక్షంలో లాక్ డౌన్ సమయంలో థియేటర్ల విద్యుత్ ఫిక్సెడ్ చార్జీలు మాఫీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here