
ప్రతి ఏడాది వివిధ భాషల్లో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూ భారీ పాపులారిటీ కూడగట్టుకుంది బిగ్‌బాస్. ఈ ప్రోగ్రాంలో బిగ్‌బాస్ ఇచ్చే టాస్క్‌లు, కంటిస్టెంట్ల బిహేవియర్ అన్నీ హైలైట్ అవుతుండటంతో ఈ రియాలిటీ షోకి యమ డిమాండ్ ఏర్పడింది. దీంతో అన్ని భాషల్లోనూ టీఆర్ఫీ పరంగా ఫస్ట్ ప్లేస్ కొట్టేస్తోంది బిగ్‌బాస్ షో. ఇదిలా ఉంటే మరోవైపు ఈ బిగ్‌బాస్‌పై కంటిస్టెంట్ల వివాదాస్పద కామెంట్స్ వెల్లువెత్తున్నాయి. ఇప్పటికే బిగ్ బాస్‌లో పాల్గొని బయటకొచ్చిన ఎందరో కంటిస్టెంట్లు ఈ షోపై పలు రకాలుగా నెగెటివ్ కామెంట్స్ చేయడం చూశాం. ఈ క్రమంలోనే తాజాగా గీతామాధురి రియాక్ట్ అవుతూ ఓ సెటైర్ వేయడం జనాల్లో హాట్ టాపిక్ అయింది.
ప్రస్తుతం తెలుగులో బిగ్ బాస్ నాలుగో సీజన్ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. గత సీజన్లతో పోల్చితే జనాలకు అంతగా తెలిసిన కంటిస్టెంట్లు లేకపోయినప్పటికీ.. బిగ్ బాస్ టాస్కులు, పార్టిసిపెంట్స్ రొమాంటిక్ కిక్‌తో ఫర్వాలేదనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవలే బిగ్ బాస్ మూడో సీజన్ కంటిస్టెంట్ తన అనుభవాలను సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ బిగ్‌బాస్ వల్ల తీవ్ర డిప్రెషన్‌కు లోనయ్యానని చెప్పి చర్చలకు తెరలేపింది. అంతటితో ఆగక ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇతర ఫిమేల్ కంటెస్టెంట్లు కూడా తమ అనుభవాలను వెల్లడించాలని కోరింది.