Visakha: పెళ్లి చేయడం లేదని చనిపోతాననేవాడు.. చివరికి..
Visakha: పెళ్లి చేయడం లేదని చనిపోతాననేవాడు.. చివరికి..

పెళ్లి చేయడం లేదంటూ తల్లిదండ్రులతో గొడవపడే యువకుడు చనిపోతానంటూ బెదిరించేవాడు. చివరికి అదే నిజం చేసేశాడు. పెళ్లి చేయడం లేదన్న మనస్థాపంతో ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ విషాద ఘటన విశాఖపట్నం జిల్లాలో జరిగింది. అనంతగిరి మండలం కొత్తూరు పంచాయతీ శివలింగపురానికి చెందిన భీమవరపు నవీన్(24) నిత్యం తాగొచ్చి పెళ్లి చేయమంటూ గొడవపడేవాడు. పెళ్లి చేయకపోతే చనిపోతానంటూ బెదిరింపులకు దిగేవాడు.

అయినా కుటుంబ సభ్యులు పట్టించుకోవడం లేదని తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఆత్మహత్య చేసుకుంటానంటూ ఇంట్లోకి వెళ్లడంతో రోజు మాదిరిగానే మారోమారు బెదిరిస్తున్నాడని అనుకున్నారు. ఇంట్లోకి వెళ్లిన నవీన్ చున్నీతో ఫ్యాన్ హుక్‌కి ఉరి వేసుకుని అఘాయిత్యం చేసుకున్నాడు. బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here