నాకు గుణపాఠం నేర్పారు.. ఇకపై అలా చేయను: మంచు లక్ష్మి ఫైర్
నాకు గుణపాఠం నేర్పారు.. ఇకపై అలా చేయను: మంచు లక్ష్మి ఫైర్

బాలీవుడ్ డ్రగ్స్ కేసులో రాజకీయ లబ్ధి కోసమే అమాయక మహిళను కొందరు అన్యాయంగా ఇరికించారని ఆరోపించారు టాలీవుడ్ నటి మంచులక్ష్మి. సాటి మహిళగా రియాకు మద్దతు తెలపిన తనపై సోషల్‌మీడియాలో ఇష్టం వచ్చినట్లు కామెంట్ చేయడం కలిచివేసిందన్నారు. డ్రగ్స్ వ్యవహారంపై మాట్లాడొద్దని మా నోళ్లు కట్టేస్తున్న అధికారులు.. విచారణ సమాచారాన్ని లీక్ చేస్తున్న మీడియా సంస్థలపై మాత్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.

సుశాంత్ ఆత్మహత్య తర్వాత సెలబ్రెటీ ఆత్మహత్యలు ఆగలేదని, కానీ వాటి గురించి ఎవరూ మాట్లాడటం లేదని మంచు లక్ష్మి అన్నారు. ఇది ఒక అమ్మాయి, అబ్బాయి మధ్య జరిగిన గొడవ మాత్రమేనని, ఇందులో రియాను అనవసరంగా ఇరికించారన్నారు. డ్రగ్స్‌కు సంబంధించి బయటికొచ్చిన వాట్సాప్ ఛాటింగ్ కల్పితమై ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. రియాకు మద్దతుగా ట్వీట్ చేసినందుకు తనను కూడా ఆ వివాదంలోకి లాగేందుకు ప్రయత్నించారన్నారు. చట్టం అడ్డురాకపోతే తాను చాలా మాట్లాడగలనని ఆమె పేర్కొన్నారు.

తనపై వచ్చే వార్తలు చూసిన తల్లి చాలా టెన్షన్ పడుతున్నారని మంచు లక్ష్మి తెలిపారు. రియాకు మద్దతుగా నిలవడం తనకు గుణపాఠం నేర్పిందని, ఇకపై ఏ విషయంపై అయినా బహిరంగంగా అభిప్రాయాలు వెల్లడించబోనని స్పష్టం చేశారు. తప్పు చేస్తే జైల్లో పెట్టాలని, అంతేగాని నోటికొచ్చినట్లు మాట్లాడి ఎదుటివారి మనోభావాలు దెబ్బతీయడం సరికాదని ఆమె హితవు పలికారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here