Samsung Festival Offers: పండుగకు షాపింగ్ చేస్తున్నారా.. శాంసంగ్ అందిస్తున్న సూపర్ ఆఫర్లు ఇవే..
Samsung Festival Offers: పండుగకు షాపింగ్ చేస్తున్నారా.. శాంసంగ్ అందిస్తున్న సూపర్ ఆఫర్లు ఇవే..

పండుగ సీజన్లో ఎలక్ట్రానిక్ వస్తువులకు మంచి డిమాండ్ ఉంటుంది. ఈ సీజన్‌లోనే టెలివిజన్లు, రిఫ్రిజిరేటర్లు, ఇతర ఉపకరణాల అమ్మకాలు అత్యధికంగా జరుగుతాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని వ్యాపారులు కస్టమర్ల కోసం ఆఫర్లు ప్రకటిస్తారు. ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల్లో టాప్ బ్రాండ్ గా పేరొందిన శాంసంగ్ సంస్థ, వినియోగదారుల కోసం ‘హోమ్, ఫెస్టివ్ హోమ్’ పేరుతో ఆఫర్లను ప్రకటించింది. వినియోగదారులు దసరా, దీపావళికి చేసే షాపింగ్‌కు శాంసంగ్ ప్రొడక్ట్‌లపై రూ.20,000 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. దీంతో పాటు స్మార్ట్‌ఫోన్‌లను గెలుచుకునే అవకాశాన్ని శామ్ సంగ్ కల్పిస్తోంది. ఈ ‘హోమ్, ఫెస్టివ్ హోమ్’ ఆఫర్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. నవంబర్ 20, 2020 వరకు ఈ ఆఫర్లు ఉంటాయి. వినియోగదారులు టీవీలు కొంటే, వాటిపై శామ్‌సంగ్ గెలాక్సీ ఫోల్డ్, గెలాక్సీ ఎస్20 అల్ట్రా, గెలాక్సీ ఎ21, గెలాక్సీ ఎ31 ఫోన్లలో ఏదో ఒకటి పొందే అవకాశం ఉంది.


ఆఫర్లు ఇవే..

-హోమ్ ఫెస్టివల్ ఆఫర్లో భాగంగా Samsung QLED 8K TV సిరీస్‌లో 85-అంగుళాలు, 82-అంగుళాలు, 75-అంగుళాల టీవీ మోడళ్లను కొనుగోలు చేసేవారికి రూ.1,30,980 తక్కువ ధరకే శామ్‌సంగ్ గెలాక్సీ ఫోల్డ్ లభిస్తుంది. దీన్ని గత ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేశారు. ఈ ఫోన్ అసలు ధర రూ.1,73,999.

– 65 అంగుళాల శామ్‌సంగ్ QLED, QLED 8K, 70 అంగుళాలు, అంతకంటే ఎక్కువ ఉండే Crystal 4K UHD TV మోడళ్లను కొనుగోలు చేసేవారికి Samsung Galaxy A31 స్మార్ట్‌ఫోన్ లభిస్తుంది. మన దేశంలో దీని ప్రస్తుత ధర రూ.19,999.

-75 అంగుళాలు, అంతకంటే ఎక్కువ QLED TV టీవీ మోడళ్ల కొనుగోలుపై వినియోగదారులకు Samsung Galaxy S20 Ultra స్మార్ట్‌ ఫోన్‌ లభిస్తుంది. ప్రస్తుతం దీని ధర రూ.97,999. దీంతోపాటు 55 అంగుళాల QLED TV, 65 అంగుళాల UHD TV మోడళ్లు కొనేవారికి శామ్‌సంగ్ గెలాక్సీ ఎ 21 ఫోన్‌ను అందిస్తారు. వీటి ధరలు రూ.14,999(4 జీబీ ర్యామ్), రూ.16,499(6 జీబీ ర్యామ్)గా ఉన్నాయి. టీవీలతో ఏ వేరియంట్ ఫోన్‌ను ఇస్తామనేది కంపెనీ వెల్లడించలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here