రిచా వర్సెస్ పాయల్: చివరికి క్షమించమని వేడుకుంది!
రిచా వర్సెస్ పాయల్: చివరికి క్షమించమని వేడుకుంది!
అయ్యిందేదో అయ్యింది… రాజీకొచ్చేద్దాం… నోరు జారినందుకు నన్ను క్షమించు ప్లీజ్!! ఇదీ పాయల్ ఘోష్ లేటెస్ట్ వెర్షన్. మీటూ వేదికగా రిచా చద్దా తన దర్శకుడు అనురాగ్ కశ్యప్ కి  ఫోన్ కాల్ దూరంలో అందుబాటులో ఉంటుందని పాయల్ ఇంతకుముందు మీడియా వేదికగా నిందారోపణ చేసింది. దీనిపై సీరియస్ అయిన రిచా చద్దా ఆ ఇంటర్వ్యూ చేసిన చానెల్ సహా పాయల్ పైనా పరువు నష్టం దావా వేసింది. పరువు నష్టం దావాలో రిచా 1.10 కోట్లు కోరడం మరో హైలైట్. నటి రిచా చద్దాపై కొన్ని నిరాధారమైన వ్యాఖ్యలు చేయడంతో ఇప్పుడు పాయల్ దిగొచ్చి క్షమాపణ కోరాల్సొచ్చింది.

బాంబే హైకోర్టు ఈ వివాదంపై ఫిర్యాదును స్వీకరించింది. తాజా విచారణల పాయల్ తన ఆరోపణలపై యు-టర్న్ తీసుకోవడం సంచలనమైంది. రిచా చద్దాకు క్షమాపణ చెబుతానని ప్రతిపాదించింది.  పాయల్  న్యాయవాది నితిన్ సాత్పుట్ తన క్లయింట్ క్షమాపణ చెప్పడానికి .. అలాగే ఆమె ప్రకటనను రాజీగా ఉపసంహరించుకోవడానికి సిద్ధంగా ఉన్నారని కోర్టుకు తెలియజేశారు.

ఇక ఈ కేసులోనే మరోవైపు  క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్ కామెంట్ చేయడంతో ఆయనపైనా పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. అతడు కోర్టుకు తన నిర్ణయాన్ని రెండు రోజుల్లో వెల్లడిస్తారని సమాచారం. ఇక తాజా వివాదం పుణ్యమా అని పాయల్ కి రిచా చద్దాకి జనంలో ఫాలోయింగ్ పెరిగిందన్న గుసగుసా వినిపిస్తోంది. ఇంతకుముందు పాయల్ అంటే ఎవరో కూడా తెలీని వారు ఉన్నారని నెటిజనులు కామెంట్లు చేస్తుండడం విశేషం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here