అడల్ట్ స్టార్ కు బిగ్ బాస్ లో వైల్డ్ ఎంట్రీ
అడల్ట్ స్టార్ కు బిగ్ బాస్ లో వైల్డ్ ఎంట్రీ

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా విషయమై చర్చ జరుగుతున్నా ఇదే సమయంలో బిగ్ బాస్ గురించి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తెలుగులో మొదట ప్రారంభం అయిన బిగ్ బాస్ అయిదవ వారంలోకి అడుగు పెట్టింది. ఇక తమిళం మరియు హిందీల్లో ఇటీవలే షో ప్రారంభం అయ్యింది. హిందీలో 14వ సీజన్ నడుస్తుండగా తమిళంలో 4వ సీజన్ జరుగుతోంది. హిందీ బిగ్ బాస్ కు ఎప్పటిలాగే సల్మాన్ ఖాన్ హోస్టింగ్ చేస్తున్నాడు. ఈ సీజన్ ను మరింత ఆసక్తికరంగా సల్మాన్ నడిపిస్తాడంటూ ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కంటెస్టెంట్స్ విషయంలో మరింతగా ప్రేక్షకులకు ఎంటర్ టైన్ ఇచ్చే విషయమై అన్ని రకాల వారిని ఎంపిక చేయడం జరిగింది.
మొదటి వారం తర్వాత హిందీ బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బోల్డ్ స్టార్ గా పేరు దక్కించుకున్న సప్న సప్పు దాదాపు 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతోంది. ఎన్నో సినిమాల్లో బోల్డ్ పాత్రలను చేయడంతో పాటు పలు వెబ్ సిరీస్ ల్లో నటించింది. బోజ్పురికి చెందిన ఈ నటి దాదాపుగా 200లకు పైగా సినిమాల్లో నటించింది. సప్న భాబీ వెబ్ సిరీస్ తో ఉత్తరాదిలో సంచలనం సృష్టించిన ఈమెకు అక్కడ సప్న భాబీ అనే పేరు కన్ఫర్మ్ అయ్యింది. అంతా కూడా ఆమెను సప్న భాబీ అనే పిలుస్తూ ఉంటారు. బోల్డ్ గా కనిపించేందుకు ఏమాత్రం మొహమాట పడని సప్న భాబీ బిగ్ బాస్ ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ ఇస్తుందనే నమ్మకంను నిర్వాహకలు వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఆమెను వైల్డ్ కార్డ్ ఎంట్రీతో పంపించాలని నిర్ణయించారట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here