స్కూళ్లు ఇప్పట్లో తెరచేదిలేదు : తెలంగాణ ప్రభుత్వం !
స్కూళ్లు ఇప్పట్లో తెరచేదిలేదు : తెలంగాణ ప్రభుత్వం !

 

కరోనా నేపథ్యంలో మూతబడ్డ పలు రకాలైన సంస్థలు ఇప్పుడిప్పుడే మళ్లీ తెరచుకుంటున్నాయి. ఇక తాజాగా కేంద్రం అన్ లాక్ 5.0 గైడ్ లైన్స్ ను విడుదల చేసింది. అందులో అక్టోబర్  15వ తేదీ నుంచి విద్యాసంస్థలను తెరచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దానికి మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది. అయితే తెలంగాణ సర్కార్ మాత్రం ఈ నెల  15వ తేదీ నుంచి స్కూల్స్ తెరచేది లేదు అని స్పష్టంచేసింది. వైరస్ విజృంభణ తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉన్నందున స్కూల్స్ ఇప్పట్లో ఓపెన్ చేయబోమని మంత్రివర్గ ఉపసంఘం తెలిపింది.

ఇటీవల అన్ లాక్ మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం పాఠశాలలు – కోచింగ్ సెంటర్లు – సినిమా థియేటర్లు తెరిచే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేసింది. దీంతో తెలంగాణ సర్కార్ స్కూళ్లు ఇప్పుడే తెరిస్తే విద్యార్థులు వ్యాధిబారిన పడతారనే ఉద్దేశ్యంతో వీటిని వాయిదా వేస్తున్నారు. అయితే ఉన్నతవిద్యాశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న కాలేజీలు నవంబర్ 1 నుంచి యథావిధిగా ప్రారంభమవుతాయని   మంత్రుల కమిటీ స్పష్టం చేసింది.

కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో విద్యావ్యవస్థలో చేపట్టాల్సిన కార్యక్రమాలు పాఠశాలల ప్రారంభం నిర్వహణ తదితర అంశాలపై మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు సబితా ఇంద్రారెడ్డి – కొప్పుల ఈశ్వర్ – సత్యవతి రాథోడ్ – గంగుల కమలాకర్ సమావేశం  అయ్యారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల మేరకు 50 శాతం మంది విద్యార్థులు ఒకరోజు తరగతులకు హాజరైతే.. మిగతా వారికి ఆన్లైన్ ద్వారా బోధించాల్సి ఉంటుందని అంతేకాదు పరిస్థితుల దృష్ట్యా భవిష్యత్లో విద్యార్థులకు ఆన్లైన్ బోధన తప్పనిసరి అని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రరెడ్డి స్పష్టం చేశారు. పాఠశాలల పునఃప్రారంభంపై తల్లిదండ్రుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని మంత్రి సత్యవతి రాథోడ్ సూచించారు. గిరిజన ప్రాంతాల్లో ఫోన్లకు సరైన సిగ్నల్స్ లేని కారణంగా వారికి విద్య అందించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరారు. దీన్ని బట్టి చూస్తే తెలంగాణలో ఇప్పట్లో స్కూల్స్ మళ్లీ ఓపెన్ అయ్యేలా లేవు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here