ప్రాజెక్టు మొత్తం విలువలో 5 శాతాన్ని మొబిలైజేషన్ అడ్వాన్స్‌గా చెల్లించాలని.. పనులను ప్రారంభానికి ఇది ఉపయోగపడుతుందని తెలిపాయి. అంతేకాదు కన్‌స్ట్రక్షన్ పీరియడ్‌ను 12 నెలల నుంచి 18 నెలలకు పొడిగించాలని కోరారు.

 

తెలంగాణ కొత్త సచివాలయ భవన నిర్మాణంపై దిగ్గజ నిర్మాణ సంస్థలు కన్నేశాయి. ఇప్పటికే ప్రభుత్వం టెండర్లు పిలవగా.. ఐదు కంపెనీలు తామే కాంట్రాక్ట్‌ను దక్కించుకునేందుకు తీవ్రంగా పోటీపడుతున్నాయి. దాదాపు రూ.600 కోట్లతో చేపడుతున్న ఈ తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టును చేజిక్కించుకునేందుకు టాటా ప్రాజెక్ట్స్, షాపూర్‌జీ పల్లోంజీ, లార్సెన్ అండ్ టర్బో (ఎల్ అండ్ టీ), ముంబైకి చెందిన జేఎంసీ ప్రాజెక్ట్స్, యూపీ ప్రభుత్వ రంగ సంస్థ ఉత్తర్ ప్రదేశ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ఆసక్తి చూపుతున్నాయి. ఇప్పటికే బిడ్ డాక్యుమెంట్లను కొనుగోలు చేశాయి. ఈ ఐదు కంపెనీలకు చెందిన ప్రతినిధులు బుధవారం ప్రి బిడ్ కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ప్రభుత్వానికి కీలక విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టు మొత్తం విలువలో 5 శాతాన్ని మొబిలైజేషన్ అడ్వాన్స్‌గా చెల్లించాలని.. పనులను ప్రారంభానికి ఇది ఉపయోగపడుతుందని తెలిపాయి. అంతేకాదు కన్‌స్ట్రక్షన్ పీరియడ్‌ను 12 నెలల నుంచి 18 నెలలకు పొడిగించాలని కోరారు. 2 ఎకరాల్లోని 7 లక్షల చదరపు అడుగుల్లో నిర్మాణం చేపట్టాలని.. మరో 25 ఎకరాల్లో ల్యాండ్ స్కేపింగ్, పార్కింగ్ వంటి సదుపాయలను కల్పించాలని.. వీటన్నింటినీ 12 నెలల్లో పూర్తి చేయడం కష్టమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి.ఐతే మొబిలైజేషన్ అడ్వాన్స్ చెల్లించేందుకు తెలంగాణ రోడ్లు, భవనాలశాఖ నిరాకరించింది. కాంట్రాక్టర్‌కు మొబిలైజేషన్ చెల్లించే పాలిసీ లేదని.. పనులు పూర్తైన తర్వాత బిల్లుల ప్రకారమే చెల్లింపులు ఉంటాయని స్పష్టం చేసింది. ఇక నిర్మాణ సమాయాన్ని 12 నెలల నుంచి 18 నెలల వరకు పొడిగించాలన్న విజ్ఞప్తి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని.. దీనిపై ఆయనే తుది నిర్ణయం తీసుకుంటారని రోడ్లు, భవనాలశాఖ సీనియర్ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు.

కొత్త సచివాలయం నిర్మాణానికి ఇప్పటికే డిజైన్ ఖరారయింది. ఆరు అంతస్తుల్లో సచివాలయ కాంప్లెక్స్‌ను నిర్మించనున్నారు. అన్ని విభాగాల ఉద్యోగులు పని చేసుకునేందుకు అనుకూలంగా సకల సౌకర్యాలుండేలా డిజైన్ రూపొందించారు. ప్రతి అంతస్తులోనూ డైనింగ్‌ హాల్‌, మీటింగ్‌ హాల్‌, సందర్శకుల కోసం వెయిటింగ్‌ హాల్‌, అన్ని వాహనాలకు పార్కింగ్‌ సౌకర్యం ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారుల సమావేశాల కోసం అధునాతన హాల్స్‌ను ఇక్కడ నిర్మించనున్నారు. పనులు ప్రారంభమైన ఏడాదిలోపే ఈ నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here