టాలీవుడ్ ముద్దుగుమ్మలకు బాలీవుడ్ డ్రగ్స్ సెగ...!
టాలీవుడ్ ముద్దుగుమ్మలకు బాలీవుడ్ డ్రగ్స్ సెగ...!

బాలీవుడ్ లో అనూహ్యంగా వెలుగుచూసిన డ్రగ్స్ వ్యవహారం యావత్ సినీ ఇండస్ట్రీలో ప్రకంపనలు కలిగించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు పలువురిని అరెస్ట్ చేశారు. ఇదే క్రమంలో కొందరు స్టార్ హీరోయిన్లను కూడా విచారించారు. అయితే ఈ డ్రగ్ కేసు దర్యాప్తులో KWAN (క్వాన్) టాలెంట్ మేనేజ్మెంట్ ఏజెన్సీ పేరు రావడం చర్చనీయాంశమైంది. డ్రగ్స్ వ్యవహారాలతో క్వాన్ టాలెంట్ ఏజెన్సీకి లింకులు ఉన్నాయనే కోణంలో ఎన్సీబీ అధికారులు దర్యాప్తు సాగుతుందని నేషనల్ మీడియాలో వార్తలు కూడా వచ్చాయి. ఈ క్రమంలో క్వాన్ సీఈఓను మరియు క్వాన్ తరపున వివిధ నటీనటుల కోసం పనిచేస్తున్న మేనేజర్స్ ని ఎన్సీబీ అధికారులు విచారించారు.
అయితే డ్రగ్స్ కేసులో క్వాన్ టాలెంట్ ఏజెన్సీ పేరు రావడంతో టాలీవుడ్ లో డిస్కషన్ జరిగింది. ఎందుకంటే ఈ ఏజెన్సీతో టాలీవుడ్ కి చెందిన చాలా మంది ఆర్టిస్టులు డీలింగ్స్ చేసుకొని ఉండటమే అని తెలుస్తోంది. ముఖ్యంగా తెలుగు అప్ కమింగ్ హీరోయిన్స్ చాలామంది ఈ సంస్థతో ఒప్పందాలు కుదుర్చుకున్నారని సమాచారం. అయితే ఇప్పుడు అనుకోకుండా డ్రగ్స్ కేసులో ఈ ఏజెన్సీ పేరు రావడం.. సీఈఓ తో పాటు బాలీవుడ్ హీరోయిన్లను మరియు వారి మేనేజర్స్ ని కూడా విచారించడంతో ఇప్పుడు క్వాన్ తో డీలింగ్ చేసుకున్న టాలీవుడ్ ముద్దుగుమ్మలందరూ సైలెంట్ అయిపోయారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ కేసులో నిజానిజాలు ఒక కొలిక్కి వచ్చే వరకు ఈ సైలెన్స్ ఇలానే కొనసాగుతుందని ఇండస్ట్రీ వర్గాల్లో అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here