జగన్ సన్నిహితుడికి రెండోసారి కరోనా?
జగన్ సన్నిహితుడికి రెండోసారి కరోనా?

కరోనా విషయంలో ఏ మాత్రం అశ్రద్ధ వహించినా అది పెట్టే ఇబ్బంది అంతా ఇంతా కాదు. ఒకసారి కరోనాను జయించిన తర్వాత మరోసారి రాదన్న గ్యారెంటీ లేదు. జలుబు.. జ్వరం ఎలా అయితే ఎన్నిసార్లు వస్తాయో.. కరోనా కూడా అలానే ఒకసారి తర్వాత మరోసారి వచ్చే అవకాశం లేకపోలేదు. అందుకే.. కరోనా విజేత అని సంబరపడాల్సిన అవసరం లేదు. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా.. అందుకుతగ్గ మూల్యం చెల్లించాల్సి వస్తుంది.

తాజాగా అలాంటి పరిస్థితే నెలకొంది. ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడు.. తిరుపతి ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న భూమన కరుణాకర్ రెడ్డి తాజాగా కరోనా బాధితులయ్యారు. ఇప్పటికే ఒకసారి మహమ్మారిని జయించిన ఆయన.. రెండోసారి పాజిటివ్ గా మారటం గమనార్హం. తిరుపతిలోని ఒక ప్రైవేటు ల్యాబ్ లో పరీక్షించుకున్న ఆయనకు కరోనా పాజిటివ్ గా తేలింది.

ఈ ఆగస్టులో తొలిసారి భూమనకు కరోనా సోకింది. అప్పట్లో చికిత్స పొందిన ఆయన.. త్వరగానే కోలుకున్నారు. అప్పట్లో ఆయన తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. తాజాగా మరోసారి కరోనా బారిన పడినట్లుగా బయటకు వచ్చిన సమాచారం షాకింగ్ గా మారింది. ఈ పరిణామం చాలామంది ప్రజాప్రతినిధులకు.. రాజకీయాల్లో చురుగ్గా ఉండే నేతలందరికి ఒక హెచ్చరిక లాంటిదిగా చెబుతున్నారు. కరోనా ఒకసారి వచ్చింది కాబట్టి.. ఫర్లేదు అనుకుంటే తప్పులో కాలేసినట్లుగా చెప్పక తప్పదు. సో.. బీకేర

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here