బ్యాంకాక్ .. థాయ్ ల్యాండ్ లోకల్ ఫైటర్లతో రౌడీ ఫైట్!
బ్యాంకాక్ .. థాయ్ ల్యాండ్ లోకల్ ఫైటర్లతో రౌడీ ఫైట్!

విజయ్ దేవరకొండ- పూరి జగన్నాథ్ కాంబినేషన్ మూవీ ఫైటర్ తాజా షెడ్యూల్ సన్నివేశమేమిటో?  ముంబైలో షూటింగ్ చేస్తుండగా మహమ్మారీ తరుముకొచ్చింది. పూరి అనుకున్నదొకటి అయితే ఇంకొకటి జరిగింది. దీంతో హైదరాబాద్ లో సెట్స్ వేసి ఇక్కడ ముంబై షెడ్యూల్ ని పూర్తి చేస్తున్నారని ఇదివరకూ వార్తలొచ్చాయి.
తాజా సమాచారం ప్రకారం.. దేవరకొండ-పూరి – ఛార్మి బృందం విదేశాల్లో షూటింగుకి పయనం కానున్నారని లీకులందాయి. బ్యాంకాక్ .. థాయ్ ల్యాండ్ లో అక్కడ లోకల్ ఫైటర్లతో రౌడీకి పని పడిందట.  కొన్ని యాక్షన్ ఎపిసోడ్లు థాయ్ మార్షల్ ఆర్ట్స్ మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో స్థానిక కళాకారులతో తెరకెక్కించాల్సి ఉందట.  ఫైట్స్ కి స్పెషల్ స్పోర్ట్ లుక్ తేవాలన్నది పూరి ప్లాన్ అని తెలిసింది.

రౌడీ-పూరి బృందం త్వరలో థాయిలాండ్ వెళ్లి.. బ్యాంకాక్ లోనూ షూటింగ్ చేయాలని నిర్ణయించుకున్నారట. షెడ్యూల్ మొత్తం యాక్షన్ ఎపిసోడ్లు చేయడానికి ప్రణాళిక రెడీ అయ్యింది. ఈ షెడ్యూల్ కోసమే ఇటీవల విజయ్ దేవరకొండ జిమ్ లు వదలకుండా కసరత్తులు చేస్తున్నాడు. ఇప్పటికే 6 ప్యాక్ లుక్ కి షిఫ్టయ్యాడు.. వచ్చే ఏడాది రిలీజ్ కి సిద్ధం చేయాలన్నది పూరి పట్టుదల. ఫైటర్ లో అనన్య పాండే కథానాయిక. పూరి జగన్నాధ్- కరణ్ జోహార్ సంయుక్తంగా ఈ పాన్ ఇండియా సినిమాని నిర్మిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here