ముఖ్యమంత్రి జగన్‌పై సీబీఐ కోర్టులో నమోదైన కేసులుపై విచారణ
ముఖ్యమంత్రి జగన్‌పై సీబీఐ కోర్టులో నమోదైన కేసులుపై విచారణ

హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి జగన్‌పై సీబీఐ కోర్టులో నమోదైన కేసులు శుక్రవారం విచారణకు రానున్నాయి. హెటిరో, అరబిందోలకు భూ కేటాయింపులు, జగతిలో పెట్టుబడులు, పెన్నా ఇండియా, ధాల్మియా, భారతి సిమ్మెంట్‌కు లీజులు, ఇందూ గ్రూప్, వాన్‌పిక్‌కు భూ కేటాయింపులు తదితరాలపై సీబీఐ నమోదు చేసిన 11 కేసులను విచారిస్తారు. వాటితోపాటు ఎమ్మార్ విల్లాలు, ప్లాట్ల కేటాయింపులపై నమోదైన కేసు, ఓబులాపురం గనుల లీజు వ్యవహారంపై నమోదైన కేసులతోపాటు జగన్ కేసుల్లో పెట్టుబడుల నిధుల బదలాయింపుల్లో అవకతవకలపై మనీల్యాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ నమోదు చేసిన ఐదు కేసులు.. ఎమ్మార్ వ్యవహారంపై ఈడీ కేసులు ఇవాళ విచారణకు రానున్నాయి

ప్రజాప్రతినిధులు, మాజీలపై ఉన్న కేసులపై రోజువారీ విచారణ జరపాలన్న సుప్రీంకోర్టు మార్గదర్శకాల నేపథ్యంలో.. ఏపీ సీఎం జగన్‌ అక్రమాస్తుల కేసు గురువారం ఈడీ ప్రత్యేక కోర్టులో విచారణకు వచ్చింది. నిజానికి ఈ కేసులు ఈ నెల 13న విచారణకు రావాల్సి ఉంది. అయితే నేతలపై ఉన్న కేసుల విచారణను ఆయా కోర్టులు ముందుకు జరిపాయి. మరోవైపు ఈడీ, సీబీఐ నమోదు చేసిన మరికొన్ని కేసులు శుక్రవారం విచారణకు రానున్నాయి.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here