పెళ్లి 'ఆచార్య'కు అడ్డు కాబోదు.. అవి పుకార్లేనట
పెళ్లి 'ఆచార్య'కు అడ్డు కాబోదు.. అవి పుకార్లేనట

మెగాస్టార్ చిరంజీవి.. కొరటాల శివల కాంబినేషన్ లో రూపొందుతున్న ‘ఆచార్య’ సినిమా కోసం మొదట త్రిషను ఎంపిక చేయగా ఆమె ఒకటి రెండు రోజులు షూటింగ్ లో పాల్గొన్న తర్వాత మొదట అనుకున్నట్లుగా లేదు నా పాత్రను చెప్పినట్లుగా కాకుండా మరోలా చిత్రీకరిస్తున్నారు అంటూ తప్పుకుంటున్నట్లుగా ప్రకటించింది. త్రిష తప్పుకున్న తర్వాత ఆ స్థానంను కాజల్ తో భర్తీ చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఆ విషయం నిజమే అన్నట్లుగా కాజల్ అగర్వాల్ ఒక లైవ్ చాట్ లో పేర్కొంది. కాజల్ షూటింగ్ లో జాయిన్ అవ్వాల్సి ఉండగా కరోనా కారణంగా షూటింగ్ ఆగిపోయింది.
ఏడు నెలలుగా ఆచార్య సినిమా షూటింగ్ జరగడం లేదు. ఈ సమయంలోనే కాజల్ అగర్వాల్ పెళ్లి కుదిరింది. ఇప్పటి వరకు ఒక్క రోజు కూడా కాజల్ ఆచార్య షూటింగ్ లో పాల్గొనలేదు. కనుక పెళ్లి అయిన హీరోయిన్ అవసరమా అంటూ ఆచార్య మేకర్స్ ఆమెను తప్పించారనే వార్తలు వచ్చాయి. మరికొందరు పెళ్లి కారణంగా ఆచార్య సినిమాను వదిలేయాలనే నిర్ణయానికి కాజల్ వచ్చిందని ప్రచారం జరుగుతుంది. కాని మీడియాలో వస్తున్న వార్తలు అన్ని కూడా పుకార్లే అని కాజల్ టీం క్లారిటీ ఇచ్చింది.

పెళ్లి ఈనెల 30వ తారీకున జరుగబోతుంది. పెళ్లి తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని కాజల్ ఆచార్య సినిమాలో నటించబోతుంది. మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా గాలి వార్తలు మాత్రమే. వాటిని నమ్మి ప్రేక్షకులు మోసపోవద్దు అన్నారు. కాజల్ ఇండియన్ 2 మరియు ఆచార్య సినిమాల్లో నటించడం ఖాయం అన్నారు. ఈ రెండు సినిమాలు మాత్రమే కాకుండా పెళ్లి తర్వాత కొత్త సినిమాలను కూడా కమిట్ అయ్యి నటించేందుకు రెడీగా ఉన్నట్లుగా కాజల్ అగర్వాల్ ప్రకటించిన విషయం తెల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here