క‌రోనా భ‌యాల‌తో చంద్ర‌బాబు నాయుడు కొన్ని నెల‌లుగా హైద‌రాబాద్ కు ప‌రిమితం అయ్యారు. క్ర‌మంగా క‌రోనా త‌గ్గుముఖం ప‌డుతూ ఉంది. ఈ క్ర‌మంలో ఆయ‌న అమ‌రావ‌తి ప్రాంతానికి రావ‌డంతో ఆయ‌న‌ను క‌ల‌వొచ్చ‌ని క్యాడ‌ర్ ఆయ‌న నివాసం వ‌ద్ద‌కు చేరుకోగా.. వారికి చంద్ర‌బాబు నాయుడుతో స‌మావేశం అయ్యే అవ‌కాశం ద‌క్క‌లేద‌ని తెలుస్తోంది. క‌రోనా భ‌యాల‌తో చంద్ర‌బాబు నాయుడు ఎవ్వ‌రినీ క‌ల‌వ‌డానికి ఇష్ట‌ప‌డ‌లేద‌ని స‌మాచారం. దీంతో ఆయ‌న ఏపీకి వ‌చ్చాడ‌ని, క‌ల‌వొచ్చ‌ని అనుకున్న వారు అదేం జ‌ర‌గ‌కుండానే వెనుదిర‌గాల్సి వ‌చ్చింద‌ని తెలుస్తోంది.

విశేషం ఏమిటంటే.. ఈ మాత్రం దానికి ఆయ‌న ఏపీకి ఎందుకు వ‌చ్చిన‌ట్టు? అనే ప్ర‌శ్న‌ను ప‌చ్చ‌చొక్క‌లే వేసుకుంటూ వెనుదిరిగాయ‌ట‌! హైద‌రాబాద్ లోనే ఉండి ఉన్నా, అమ‌రావ‌తి వ‌చ్చి ఎవ‌రినీ క‌ల‌వ‌క‌పోయినా తేడా లేదు క‌దా? అనే చిన్న లాజిక్ ను ప‌చ్చ‌చొక్కాలు ప్ర‌స్తావించుకుంటున్నాయ‌ట‌. అయితే చంద్ర‌బాబు తీరు  మాత్రం డొల్ల‌గానే ఉంటుందెప్పుడూ.

క‌రోనా భ‌యాల‌తో ఆయ‌న హైద‌రాబాద్ లోనే ఉంటూ వ‌చ్చారు. ఒక పార్టీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు దాని అధినేత ఇలా నెల‌లు నెల‌లు క్యాడ‌ర్ కు, ప్ర‌జ‌ల‌కు దూరంగా ఉంటే.. ఆటోమెటిక్ గా స‌ద‌రు నేత‌ను ప్ర‌జ‌లు మ‌రిచిపోతారు. ఇప్పుడు చంద్ర‌బాబు ప‌రిస్థితి కూడా అలానే ఉంది. ఎన్ని జూమ్ మీటింగులు పెడితే మాత్రం.. ఒక వంద మంది కార్య‌క‌ర్త‌ల‌తో డైరెక్టుగా క‌ల‌వ‌డంతో సాటి?

అన్నింటికీ మించిన ప్ర‌శ్న ఏమిటంటే..లోకేష్ ఏం చేస్తున్న‌ట్టు? అనేది. చంద్ర‌బాబుకు వ‌య‌సు మీద ప‌డింది. ఈ వ‌య‌సులో క‌రోనా ప‌రిస్థితుల్లో ఆయ‌న బ‌య‌ట‌కు రాలేక‌పోవ‌చ్చు. ఆ వ‌య‌సు వారికి క‌రోనా ప్ర‌మాద‌క‌రం అని వైద్యులే స్పష్టం చేస్తున్నారు. ఇప్పుడే కాదు.. క‌రోనా పూర్తిగా జ‌నం నుంచి మాయం అయ్యింద‌నే వ‌ర‌కూ చంద్ర‌బాబు నాయుడు ప‌బ్లిక్ లోకి రాలేరు.

అలాంట‌ప్పుడు లోకేష్ అయినా చొర‌వ‌గా ముందుకు రావొచ్చు క‌దా? అనేది ఒక సందేహం. అయితే లోకేష్ లో అలాంటి చొర‌వ మొద‌టి నుంచి కొర‌వ‌డింది. నెల‌లు నెల‌లు గ‌డిచిపోతున్నా.. పార్టీ కాడిని ప‌క్క‌న ప‌డేసి.. జూమ్, ట్విట్ట‌రే రాజ‌కీయం అనే భ్ర‌మ‌ల్లో చంద్ర‌బాబు, లోకేష్ లు మునిగిన‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దాని ఫ‌లితాలు ఏమిటో క్షేత్ర స్థాయికి వెళితే అర్థం అవుతాయి! చంద్ర‌బాబు, లోకేష్ ల‌కు అలా వెళ్లే ఉద్దేశం కూడా ఉన్న‌ట్టుగా లేన‌ట్టుగా ఉంద‌ని ప‌రిశీల‌కులు అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here