RCB: చెన్నైపై అదరగొట్టిన కోహ్లి.. ముద్దులతో స్వాగతం పలికిన అనుష్క శర్మ
RCB: చెన్నైపై అదరగొట్టిన కోహ్లి.. ముద్దులతో స్వాగతం పలికిన అనుష్క శర్మ

శనివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత విజయాన్ని అందుకుంది. 90 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన కోహ్లి.. ఆర్సీబీ బ్యాటింగ్‌కు వెన్నెముకగా నిలిచాడు. ధోనీసేనపై బెంగళూరుకు ఘన విజయాన్ని అందించాడు. అద్భుత బ్యాటింగ్‌తో 52 బంతుల్లో 90 రన్స్‌తో అజేయంగా పెవిలియన్ చేరుతున్న సమయంలో.. కోహ్లికి అనుష్క శర్మ ఫ్లయింగ్ కిస్సులు ఇచ్చింది. తన భర్తను చూసి మురిసిపోతూ.. మనసారా నవ్వుకుంది.

ప్రస్తుతం ప్రెగ్నెంట్ అయిన అనుష్క శర్మ.. రాయల్ బ్లూ డ్రెస్‌లో నవ్వుతూ.. చప్పట్లు కొడుతూ.. ఫ్లయింగ్ కిస్‌లు ఇస్తోన్న ఫొటోలు ట్విట్టర్‌ను ముంచెత్తాయి. ‘కంగాట్స్ అనుష్క శర్మ.. ఈ రోజు క్రెడిట్ మొత్తం నీదే. నీ వల్లే కోహ్లి ఇవాళ బాగా ఆడాడు. అవును.. అనుష్క వల్లే కోహ్లి విఫలమైనప్పుడు, తను బాగా ఆడినప్పుడు కారణం కూడా ఆమె కదా’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

ఈ ఐపీఎల్ సీజన్ ఆరంభంలో విరాట్ పేలవ ఆటతీరు ప్రదర్శించాడు. దీంతో కామెంటేటర్ సునీల్ గావస్కర్ ‘అనుష్క బౌలింగ్‌నే కోహ్లి ఎదుర్కొన్నాడు’ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీంతో నొచ్చుకున్న అనుష్క ఘాటుగా బదులిచ్చింది. అనంతరం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్లో కోహ్లి (53 బంతుల్లో 75 నాటౌట్)‌ హాఫ్ సెంచరీతో ఫామ్‌‌లోకి వచ్చాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here