జగన్ నిర్ణయం శహభాష్
జగన్ నిర్ణయం శహభాష్

తుంటి మీద కొడితే పళ్లు రాలాయి అని అంటే కాస్త నవ్వులాటగానే వుంటుంది. కానీ రాజకీయాల్లో మాత్రం ఇదే ఎక్కువగా వాడే అస్త్రం. వందల కోట్లు బ్యాంకు రుణాల లావాదేవీలు వున్నాయి ఎంపీ రఘురామ కృష్ణం రాజు కు. ఆయనకు కంపెనీలు వున్నాయి. వాటికి రుణాలు వున్నాయి. వాటిలో అవకతవకలు వున్నాయి. ఎగవేతలు వున్నాయి అని అనేకానేక టాక్ లు వున్నాయి.

లేటెస్ట్ గా ఈ రుణాల అవకతవకల వ్యవహారాలకు సంబంధించి సిబిఐ సోదాలు చేపట్టింది. సిబిఐ ఇలా సోదాలు చేస్తూనే వుంటుంది. ఆ కేసులు అలా నడుస్తూనే వుంటాయి. ఇదంతా జనాలకు అలవాటైపోయింది. పంజాబ్ నేషనల్ బ్యాంకు నేతృత్వంలోని కన్సార్షియం ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు  సిబిఐ లేటెస్ట్ ప్రెస్ నోట్ లో పేర్కొంది. రూ. 826.17 కోట్ల మోసానికి పాల్పడినట్టు ఫిర్యాదు అందినట్లు తెలిపింది.

అయితే ఇక్కడే అర్జెంట్ గా ఓ ఫొటో క్లిప్ చలామణీలోకి వచ్చింది. ఆంధ్ర సిఎమ్ వైఎస్ జగన్ ఇటీవల ఢిల్లీ వెళ్లినపుడు పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎండీ, సిఇఓ, ఇంకా ఇతర అధికారులు కొందరు ఆయనను కలిసారు. సరే, ఇలా కలవడం అన్నది కామన్. ఆయా రాష్ట్రాల సిఎమ్ లను కలిసి, ఆయా రాష్ట్రాల్లో బ్యాంక్ అభివృద్దికి కృషి చేయడం అన్నది బ్యాంక్ అధికారులకు కామన్.

కానీ ఇలా జగన్ ను వారు, వారిని జగన్ కలిసిన కొద్ది రోజులకే ఆ బ్యాంకు రుణాలకు సంబంధించి రఘురామ కృష్ణం రాజు అవకతవకల మీద ఫిర్యాదు అందడం, సిబిఐ సోదాలు చేపట్టడం విశేషం. దాన్నే ఇప్పుడు ప్రచారంలోకి తెస్తున్నారు. ఆ విధంగా ఆర్ఆర్ఆర్ అని పాపులర్ అవుతున్న రఘురామకృష్ణం రాజు ను జగన్ ఆ విధంగా టార్గెట్ చేసారని చెప్పకనే చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here