ఫుడ్ తెప్పించుకుంటే.. బూతు వీడియోలు పంపుతున్నాడు
ఫుడ్ తెప్పించుకుంటే.. బూతు వీడియోలు పంపుతున్నాడు

ఎంత అలెర్టుగా ఉండాలన్న విషయాన్ని చెప్పే ఉదంతంగా దీన్ని చెప్పాలి. ఫుడ్ డెలివరీ యాప్ ద్వారా ఆర్డర్ ఇస్తే.. డెలివరీ కోసం వచ్చిన కుర్రాడి ఆరాచకం ఒక మహిళకు చుక్కలు చూపించిన వైనమిది. కేసు నమోదు చేసిన పోలీసులు సదరు డెలివరీ బాయ్ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఇంతకూ జరిగిందేమంటే..

అమీర్ పేటకు చెందిన ఒక మహిళ గత నెల 31న ఒక యాప్ ద్వారా పుడ్ డెలివరీ కోసం ఒక ఆర్డర్ చేశారు. రవి అనే డెలివరీ బాయ్ దాన్ని తీసుకొచ్చాడు. బిల్ పే చేయాల్సి రావటంతో.. సదరు మహిళ తన ఫోన్ నుంచి గూగుల్ పే ద్వారా మనీ పే చేశారు. ఆ సందర్భంగా మనీ పే చేసిన స్క్రీన్ షాట్ ను వాట్సాప్ చేశారు.

దీంతో ఆమె ఫోన్ నెంబరు తెలుసుకున్న డెలివరీ బాయ్ రవి.. రెండు రోజుల తర్వాత నుంచి ఆమెకు అశ్లీల సందేశాలు.. బూతు వీడియోలు పంపటం షురూ చేశాడు. దీంతో.. ఆమె ఆ నెంబరును బ్లాక్ చేసింది. మరో నెంబరుతో మళ్లీ సదరు డెలివరీ బాయ్ వేధింపులు మొదలెట్టాడు. ఈ నేపథ్యంలో విసిగిపోయిన ఆమె.. ఎస్ ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కంప్లైంట్ రిజిస్టర్ చేసిన పోలీసులు డెలివరీ బాయ్ కోసం గాలింపులు చేపట్టారు. ఈ ఉదంతాన్ని చూసినప్పుడు డెలివరీ బాయ్ కావొచ్చు.. ఇంకెవరైనా కావొచ్చు.. ఫోన్ నెంబరు తెలీకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని చెబుతుంది. ఇప్పుడున్న డిజిటల్ ప్రపంచంలో ఇలాంటివి కష్టమైనా.. అలెర్టుగా ఉండాలన్న విషయాన్ని ఈ ఉదంతం చెప్పకనే చెబుతుందని చెప్పాలి.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here