సీతూపాప గురించి మహేష్ మరోసారి ఎమోషనల్
సీతూపాప గురించి మహేష్ మరోసారి ఎమోషనల్

సూపర్ స్టార్ మహేష్ బాబుకు కూతురు సితార అంటే ఎంత ఇష్టం.. ప్రేమో అందరికి తెల్సిందే. ఆయన రెగ్యులర్ గా తన పిల్లల గురించి ముఖ్యంగా కూతురు సితార గురించి సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ఉంటాడు. తాజాగా అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్బంగా మరోసారి తన కూతురు సితార గురించి స్పందిస్తూ చాలా ఎమోషనల్ వ్యాఖ్యలు పోస్ట్ చేశాడు. తన కూతురు సితార కొత్త ఫొటోను కూడా షేర్ చేసిన మహేష్ బాబు అభిమానులను మరోసారి సర్ ప్రైజ్ చేశాడు.

సోషల్ మీడియాలో మహేష్ బాబు.. కూతురు ఉండటం కంటే గొప్ప బహుమానం ఏమీ ఉండదు. నాకు నా కూతురు ఉండటం గర్వంగా ఫీల్ అవుతున్నాను. నా ప్రపంచాన్ని అద్బుతంగా అందంగా మార్చేందుకు తను ప్రయత్నిస్తూనే ఉంది. నీ కలలు ఎప్పటికి వదిలి పెట్టకుండా ముందుకు సాగిపో. నీ మాటలను కొనసాగిస్తూ బలవంతురాలిగా ఉండాలని ఆశిస్తున్నాను. నీకు ఏదైతే మంచి అనిపించిందో ఏదైతే నీకు సరైనది అనిపిస్తుందో దాని కోసం ఫైట్ చేయ్యి అంటూ కూతురు ను ఉద్దేషించి మహేష్ బాబు పోస్ట్ చేశాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here