మెగాస్టార్ సినిమాలో సాయి పల్లవి
మెగాస్టార్ సినిమాలో సాయి పల్లవి

మెగాస్టార్ వేదాళం రీమేక్ హడావుడి చకచకా సాగుతోంది. ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ లో మెహర్ రమేష్ డైరక్షన్ లో సాగే ఈ రీమేక్ కోసం రెండు కీలక కాస్టింగ్ లు ఫైనల్ చేసారు.

మెగాస్టార్ చెల్లెలి క్యారెక్టర్ కోసం సాయి పల్లవిని ఫిక్స్ చేసారు. అలాగే మరో కీలక పాత్ర కోసం కమెడియన్ కమ్ హీరో సునీల్ ను తీసుకుంటున్నారు.

ఈ సినిమాకు మ్యూజిక్ డైరక్టర్ గా మహతి స్వరసాగర్ ను తీసుకున్నారని గతంలోనే వెల్లడించాం. ఇప్పుడు సినిమా టోగ్రాఫర్ గా బాలీవుడ్ టెక్నీషియన్ డూడ్లే ను తీసుకుంటున్నారు.

డూడ్లేను మెగాస్టార్ నే స్వయంగా రికమెండ్ చేయడం విశేషం.  ఆచార్య తరువాత వేదాళం రీమేక్ నే చేయాలని ఫిక్స్ అయిపోయారు. ఆ తరువాతే లూసిఫర్ వుండే అవకాశం వుందని తెలుస్తోంది.

ఇప్పటి వరకు వేదాళం అప్ డేట్స్ గ్రేట్ ఆంధ్ర పాఠకుల కోసం ఇవి. మరి కొన్ని త్వరలో

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here