వీడియో : రకుల్.. మంచు లక్ష్మీ ఫ్రెండ్లీ హగ్ వైరల్
వీడియో : రకుల్.. మంచు లక్ష్మీ ఫ్రెండ్లీ హగ్ వైరల్

టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కు మరియు మంచు లక్ష్మికి మద్య మంచి స్నేహ బందం ఉంది. వీరిద్దరు రెగ్యులర్ గా కలుస్తూనే ఉంటారు. రకుల్ హైదరాబాద్ లో ఉంది అంటే ఖచ్చితంగా మంచు వారి అమ్మాయితోనే ఎక్కువ సమయం గడుపుతూ ఉంటుంది. షూటింగ్ లేకుండా ఖాళీగా ఉన్న సమయం పూర్తిగా మంచు లక్ష్మితోనే రకుల్ గడుపుతుందట. ఇద్దరు కలిసి వర్కౌట్ చేసే వీడియోలు మరియు ఇద్దరి యోగా ఫొటోలు మరియు వీడియోలు తెగ వైరల్ అవుతూనే ఉంటాయి. ఇటీవల రియా మరియు రకుల్ లు డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొన్న సమయంలో మంచు లక్ష్మి మద్దతుగా నిలిచింది. వారి పట్ల మీడియా వారు వ్యవహరించిన తీరు ఏమాత్రం సరి కాదంటూ హితవు పలికింది.

ఇక నిన్న రకుల్ పుట్టిన రోజు సందర్బంగా మంచు లక్ష్మి ఇన్ స్టా లో షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. మంచు లక్ష్మి ని వెనుక నుండి పట్టుకుని ఉన్న రకుల్ ఎంతో అప్యాయతను కనబర్చుతూ ఉంది. ఇద్దరి మద్య వయసు రీత్యా దాదాపుగా 15 ఏళ్ల గ్యాప్ ఉంది. అయినా కూడా ఇద్దరికి మంచి బాండింగ్ ఏర్పడటం ఇద్దరి మద్య మంచి అవగాహణ కుదరడం నిజంగా ఆశ్చర్యంగా ఉందంటూ వారిద్దరి అభిమానులు అనుకుంటున్నారు. ఇద్దరు సోషల్ మీడియాలో చేస్తున్న అల్లరి హడావుడి అంతా  ఇంతా కాదు. తాజాగా ఈ వీడియో కూడా నెట్టింట వైరల్ అవ్వడంతో వారి స్నేహం గురించి మరింత మందికి తెలిసింది అనడంలో సందేహం లేదు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here