అక్టోబర్ 30 న ముంబైలో జరిగిన ఆత్మీయ వేడుకలో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన ప్రియుడు గౌతమ్ కిచ్లుని పెళ్లాడేందుకు సిద్ధమవుతున్నానని ప్రకటించారు. మూడు ముళ్లకు సమయమాసన్నమైన సంగతిపై కాజల్ వందశాతం క్లారిటీ ఇవ్వడంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఉన్నట్టుండి సడెన్ బాంబ్ పేల్చిందిగా అంటూ ఒకటే ముచ్చట్లు సాగాయి. కాజల్ చెప్పిన గుడ్ న్యూస్ కు తన సన్నిహితులు బంధుమిత్రులు సహా సినీ పరిశ్రమకు చెందిన శ్రేయోభిలాషులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
కాజల్ ఓ బిజినెస్ మేన్ తో లవ్ లో ఉందని తనని పెళ్లాడబోతోందని తెలిసిన ఇన్ సైడ్ సర్కిల్స్ కి కాజల్ చెప్పిన వార్త అస్సలు షాకివ్వనే లేదు. ఇక కాజల్ పెళ్లి ఎప్పుడు? అన్నదానికి ముహూర్తం నిర్ణయించిన తర్వాత శుభలేఖ తో క్లారిటీ వస్తుంది. ఇప్పటికే పెళ్లి ఏర్పాట్లకు సంబంధించి ప్రతిదీ ప్లానింగ్ సాగుతోంది. అక్టోబర్ 30 న ముంబైలోని ఒక స్టార్ హోటల్ లో ఈ వివాహం జరగనుంది. పెళ్లి పనుల్లోనే హీరోయిన్ కాజల్ అగర్వాల్ బిజీగా ఉన్నారు. మహమ్మారి కారణంగా కొత్త జంటను ఆశీర్వదించడానికి సన్నిహిత కుటుంబ సభ్యులు స్నేహితులు మాత్రమే విచ్చేస్తారట.
ఈ రోజు స్టార్ హీరోయిన్ కం అక్కినేని కోడలు సమంత కాబోయే పెళ్లికూతురు కాజల్ కు ఓ ప్రత్యేక గిఫ్ట్ హంపర్ ను పంపించి ఆశ్చర్యపరిచింది. సామ్ ఈ నెల ప్రారంభంలో సాకి అనే బట్టల బ్రాండ్ ను ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా టాలీవుడ్ కోలీవుడ్ లోని పలువురు తారలకు ఆమె సాకీ గిఫ్ట్ హంపర్ ను పంపుతోంది. అటు హిందీ చిత్రసీమలో తన సన్నిహితులకు అయితే ఎలాంటి బహుమతులు ఇస్తోందో తెలీదు.