జీవాపై అసభ్యకర కామెంట్లు చేసిన బాలుడు అరెస్ట్ !
జీవాపై అసభ్యకర కామెంట్లు చేసిన బాలుడు అరెస్ట్ !

మిస్టర్ కూల్ టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎమ్ ఎస్ ధోని గారాల పట్టి జీవా ధోని పై అసభ్యకర కామెంట్లు చేసిన 16 ఏళ్ల బాలుడుని పోలీసులు అరెస్టు చేశారు. అతడు గుజరాత్ లోని కచ్ జిల్లా ముంద్రా ప్రాంతానికి చెందినవాడిగా రాంచీ పోలీసులు గుర్తించి అక్కడి పోలీసులకు సమాచారం అందించారు. దీనితో అతడిని అదుపులోని తీసుకొని విచారించగా ఆ పోస్ట్ తానే చేసినట్లు ఒప్పుకున్నాడు. రాంచీ పోలీసులు ఇక్కడికి వచ్చిన అనంతరం బాలుడుని వారికి అప్పగిస్తామని కచ్ జిల్లా ఎస్పీ సౌరబ్ సింగ్ తెలిపారు.
ప్రస్తుతం దుబాయ్ వేదికగా ఐపీఎల్ 13 వ సీజన్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే టైటిల్ హాట్ ఫెవరెట్ గా బరిలోకి దిగిన చెన్నై తోలి మ్యాచ్ లో అద్భుత విజయాన్ని అందుకుంది. అయితే ఆ తరువాత తమ స్థాయి కి తగ్గ ప్రదర్శన అయితే ఇవ్వలేకపోతుంది. ఈ నేపథ్యంలోనే కోల్ కతా తో జరిగిన మ్యాచ్ లో చెన్నై జట్టు ఓడిపోయింది. ధోని సరిగ్గా ఆడకపోవడం వల్లే మ్యాచ్ ఓడిపోయిందని మళ్లీ సరిగ్గా ఆడకపోతే జీవా ధోనిపై అత్యాచారం చేస్తానంటూ ఇన్ స్టాగ్రామ్ లో అసభ్యకర కామెంట్లు చేశాడు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపింది. పలు సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు క్రికెటర్లు దీన్ని తీవ్రంగా ఖండించారు. నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని సోషల్ మీడియాలో డిమాండ్ చేశారు.

దీంతో రంగంలోకి దిగిన రాంచీ పోలీసులు నిందితుడిని గుర్తించారు. భారత్ లో క్రికెట్ కు ఉన్నంత క్రేజ్ మరే ఇతర క్రీడకు లేదనడంలో ఏలాంటి అతిశయోక్తి లేదు. క్రికెటర్లను దేవుళ్లలా ఆరాధిస్తుంటారు అభిమానులు. వారి విజయాలను తమ గెలుపుగా భావిస్తూ ఓటమి ఎదురైన సమయాల్లో వారికి మద్దతు ప్రకటిస్తూ అభిమానం చాటుకుంటారు. కానీ కొంతమంది అభిమానం పేరిట పిచ్చి వేషాలు వేయడమే గాకుండా హద్దులు దాటి దిగజారుడుతనానికి నిదర్శనంగా నిలుస్తారు. ముఖ్యంగా సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ఈ విపరీత ధోరణి మరింతగా పెరిగిపోతోంది. ఆకతాయిలను అరికడితేనే ఇలాంటి ఘటనలు మళ్లీ చోటుచేసుకోవు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here