మహిళపై గ్యాంగ్ రేప్ నదిలో పడేసిన 5 ఏళ్ల చిన్నారి మృతి !
మహిళపై గ్యాంగ్ రేప్ నదిలో పడేసిన 5 ఏళ్ల చిన్నారి మృతి !

మహిళలపై అరాచకాలు అత్యాచారాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఎన్ని చట్టాలు ఎంతమంది పోలీసులు ఉన్నా కూడా వారిపై జరిగే అత్యాచారాలని ఆపలేకపోతున్నారు. మహిళపై అత్యాచారాలకి పాల్పడే వారికి ఎటువంటి శిక్షలు పడుతున్నాయో చూసి కూడా కామాంధులు రెచ్చిపోతున్నారు. ఈ మద్యే యూపీలోని హత్రాస్ లో జరిగిన గ్యాంగ్ రేప్ కారణంగా దేశం మొత్తం తీవ్ర ఆగ్రహంలో ఉంది.  ఈ సమయంలోనే  బీహార్ లో ఈ తరహా ఘటన తాజాగా ఒకటి వెలుగులోకి వచ్చింది.
ఈ విషయం బీహార్ లోని బక్సర్ లో వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన పై పూర్తి వివరాల్లోకి వెళ్తే .. ఐ మహిళ తన ఐదేళ్ల కుమారుడితో కలిసి బ్యాంకుకు ఓ పని నిమిత్తం బయల్దేరింది. ఈ సమయంలో ఆ మహిళను మార్గ మద్యంలో అడ్డుగించి చెట్ల పొదల్లోకి తీసుకువెళ్లి   ఆ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీని తరువాత ఆమె నోరు మూసి ఆ మహిళ తో పాటుగా 5 సంవత్సరాల పిల్లాడిని కూడా కట్టేసి నదిలో పారేసి అక్కడినుండి పారిపోయారు.

మునిగిపోతున్న మహిళ సాయం కోసం గట్టిగా అరవగా ఆ మహిళ అరుపులు విన్న స్థానికులు ఆమెను చిన్నారిని బయటకు తీశారు. అయితే అప్పటికే అతని బిడ్డ చనిపోయాడు. పని నిమిత్తం బ్యాంకుకు వెళ్తున్నానని మహిళ చెప్పింది. ఇంతలో నిందితులు దారిని చుట్టుముట్టి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసుకి సంబంధించి ఇప్పటికే ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here