లేటెస్ట్ కరోనా అప్డేట్ : దేశంలో 24 గంటల్లో 66732 కేసులు
లేటెస్ట్ కరోనా అప్డేట్ : దేశంలో 24 గంటల్లో 66732 కేసులు

భారత్ లో కరోనా జోరు కొనసాగుతుంది. తాజాగా భారత్ లో కరోనా కేసుల సంఖ్య 71 లక్షల మార్కును దాటింది. గత 24 గంటల్లో 66732 మందికి కరోనా నిర్ధారణ అయిందని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీనితో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 7120539 కి చేరింది. అలాగే గత 24 గంటల సమయంలో 816 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 109150 కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 6149536 మంది కోలుకున్నారు. 861853 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు హోం క్వారంటైన్ లలో చికిత్స అందుతోంది.

కాగా దేశంలో నిన్నటి వరకు మొత్తం 87872093 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి ప్రకటించింది. ఇక నిన్న ఒక్కరోజులోనే 994851 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.ప్రస్తుతం మొత్తం కేసుల్లో అమెరికా తర్వాత భారత్ రెండో స్థానంలో కొనసాగుతోంది. రెండు దేశాల మధ్య కేసుల తేడా… 8 లక్షలే ఉంది. రోజువారీ కొత్త కేసులలో ఇండియా మొదటి స్థానంలో కొనసాగుతుంది. ఇక మొత్తం మరణాల్లో అమెరికా బ్రెజిల్ తర్వాత భారత్ మూడోస్థానంలో కొనసాగుతోంది. రోజువారీ మరణాల్లో భారత్ మొదటిస్థానంలో

ఇక తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్రకారం.. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 1021 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో ఆరుగురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా 2214 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 213084 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 187342 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1228 కు చేరింది. ప్రస్తుతం 24514 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 228 రంగారెడ్డి జిల్లాలో 68 కేసులు నమోదయ్యాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here