నన్ను ఫాలో అవుతూ టైం వృదా చేసుకోకండి
నన్ను ఫాలో అవుతూ టైం వృదా చేసుకోకండి

టాలీవుడ్లో రిచా గంగోపాద్యాయ నటించిన సినిమాలు కొన్నే అయినా కూడా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికి నిలిచి పోయింది. ఆమె నటించిన మిరపకాయ్ మరియు మిర్చి సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఆ సినిమాల్లో ఆమె అందం గురించి ఎంత చెప్పినా తక్కువే. బొద్దుగా ముద్దుగా ఉండే ఆ అమ్మాయి అనూహ్యంగా చదువు పేరు చెప్పి దాదాపు ఎనిమిది సంవత్సరాల క్రితం అమెరికా వెళ్లి పోయింది. చదువు పూర్తి చేసి మళ్లీ సినిమాల్లో నటించేందుకు ఆమె వస్తుందని అంతా భావించారు. కాని రిచా మళ్లీ సినిమాల్లోకి రాలేదు. పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్ అయ్యింది. ఇప్పటికి కూడా ఆమెను అభిమానిస్తున్న వారు మీ రీ ఎంట్రీ కోసం వెయిట్ చేస్తున్నామంటూ కామెంట్స్ చేస్తున్నారట.
రిచా గంగోపాద్యాయకు అభిమానుల నుండి వస్తున్న కామెంట్స్ మరియు మెసేజ్ లు కోపం తెప్పించాయి. పాత సినిమాలకు సంబంధించిన ఫొటోలు మరియు కొన్ని వీడియోలను తనతో షేర్ చేస్తున్నారు. పాత ఫొటోలను షేర్ చేయడం వల్ల ఆమెకు వైవాహిక జీవితంలో ఏమైనా సమస్య వస్తుందో లేదంటే మరేదైనా కారణమో కాని ఆమె తనను ఫాలో అవ్వడం మానేసి ఏదైనా పనికి వచ్చే పని చేసుకోండి అంటూ కాస్త సీరియస్ గానే ట్వీట్ చేసింది. ట్విట్టర్ లో ఎనిమిది ఏళ్ల అయినా కూడా ఇంకా తనను వదలకుండా సినిమాల్లో నటించే విషయమై ప్రశ్నించడంపై ఆమె అసహనం వ్యక్తం చేసింది. ఇకపై అయినా ఆమె ఫాలోవర్స్ ఆమెను విసిగించకుండా ఉంటారేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here