పోలీసుల అండతో బెంగుళూరులో హైటెక్ గ్యాంబ్లింగ్
పోలీసుల అండతో బెంగుళూరులో హైటెక్ గ్యాంబ్లింగ్
బెంగుళూరులో హైటెక్ పేకాట ముఠా గుట్టు రట్టయింది. బెంగుళూరులోని ‘బెంగళూరు ఇన్’ అనే హోటల్ లో అక్రమంగా హైటెక్ గ్యాంబ్లింగ్ కేంద్రం నిర్వాకం బట్టబయలైంది. బెంగుళూరుకు చెందిన ఓ పోలీస్ ఇన్స్ పెక్టర్ అండతో కడపకు చెందిన శశి అనే ఓ వ్యక్తి ఈ గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్నారని స్థానికులు పోలీసులకు సమాచారమిచచారు. ప్రతి రోజు ఇక్కడ కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయన్న సమాచారంతో పోలీసులు సోదాలు నిర్వహించారు. సోదాల సమయంలో పోలీసులు షాకయ్యే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ వ్యవహారమంతా తమ శాఖకు చెందిన వ్యక్తి ఆధ్వర్యంలో నడుస్తున్నాయని తెలిసి నివ్వెరబోయారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బెంగళూరుకు చెందిన 80 మందిని అరెస్టు చేసిన పోలీసులు రూ. 85 లక్షల నగదు 87 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఆ కేంద్రం నిర్వాహకుడితో చేతులు కలిపిన ఇన్స్ పెక్టర్ ను సస్పెండ్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here