ఫోటో స్టోరి: గట్టెక్కిన మంకీ.. ఏమిటా `థై`తక్కలు?
ఫోటో స్టోరి: గట్టెక్కిన మంకీ.. ఏమిటా `థై`తక్కలు?

గట్టెక్కిన కోతిలా.. గంగవ్వ కూతురిలా బాగానే ఉంది కానీ! ఇక్కడ ఆవిడ నవ్వు కవ్వింపు ఏమిటో కానీ కుర్రకారు అదే పనిగా గిలిగింతకు గురై పరేషాన్ అయిపోతున్నారు. వేడెక్కించే ఫోటోషూట్లతో మెంటలెక్కిస్తోంది బాలీవుడ్ బ్యూటీ ఐషా శర్మ. ఈ భామ చిరుత బ్యూటీ నేహాశర్మకు సోదరి అన్న సంగతి తెలిసిందే. అయినా శర్మా సిస్టర్స్ కి ఇదో ఆటవిడుపుగా మారింది.

రెగ్యులర్ గా అదే పనిగో ఫోటోషూట్లకు ఎటెండవ్వడం .. వాటి నుంచి కవ్వించే ఫోటోల్ని ఇన్ స్టా మాధ్యమంలో షేర్ చేయడం వెర్రి వ్యాపకంగా మారింది. ఏమైనా అంటే.. పోటీ ప్రపంచంలో ఇంతేగా అంటారు కానీ.. ఇలాంటి ఫోటోలకు వేలం వెర్రిగా ఎగబడే నెటిజనానికి కాస్తయినా బుద్ధుండాలి. గట్టుపై పిట్టలా అలా థైతక్కల ఫోజులిచ్చేస్తే పడిపోతారా ఏమిటో!

సరే కానీ.. ఇంతకీ ఐషా శర్మ ఎన్ని సినిమాల్లో నటిస్తోంది? అంటే .. అబ్బే అలాంటిదేం లేదు. సోషల్ మీడియా కమర్షియల్స్ ద్వారా బాగా ఆర్జిస్తోంది. అడపాదడపా బాలీవుడ్ లో అరకొర ఛాన్సులే వస్తున్నాయి. అక్క నేహాశర్మ చూపించిన దారిలో వెళుతున్నా.. ఇలా ఫోటోషూట్లతో విరుచుకుపడుతున్నా చెప్పుకోదగ్గ ఆఫర్లు అయితే లేవ్. వెబ్ సిరీస్ లు .. వెబ్ మూవీలు అంటూ అసలే స్మార్ట్ డిజిటల్ యుగంలో అవకాశాలకు కొదవేమీ లేదు. వేడెక్కించే స్టింట్ ఉంది కాబట్టి ఐషాకి అవకాశాలొచ్చే అవకాశం ఉంది. అందుకే ఇలా చెలరేగుతోంది సుమీ!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here