చందమామ కాజల్ నిశ్చితార్థం .. ఇదే ఫస్ట్ ఫోటో లీక్
చందమామ కాజల్ నిశ్చితార్థం .. ఇదే ఫస్ట్ ఫోటో లీక్

చందమామ కాజల్ పెళ్లికూతురవుతున్న సంగతి తెలిసిందే. ముంబైలో ఒక ప్రైవేట్ వ్యవహారంగా ఇది వుండబోతోంది. అక్టోబర్ 30 న ముంబయికి చెందిన పారిశ్రామికవేత్త గౌతమ్ కిచ్లుని కాజల్ పెళ్లాడనుంది. వాస్తవానికి ఈ జంట ఒక స్టార్ హోటల్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ తరహా పెళ్లి చేసుకుంటుందని వార్తలు వచ్చాయి. కానీ చివరకు ముంబైలోని మెరైన్ డ్రైవ్ లోని కాజల్ ఇంట్లో ఒక సాధారణ వివాహ వేడుక వైపు మొగ్గు చూపారు.

అయితే నిశ్చితార్థం సంగతేమిటి? అంటే తాజాగా అందుకు సంబంధించిన పిలుపు కూడా అందింది. కాజల్- గౌతమ్ కిచ్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అరుదైన ఈ సందర్భానికి సంబంధించిన ఫోటో ఒకటి అంతర్జాలంలో వైరల్ అవుతోంది. వరుడు గౌతమ్ స్వయంగా ఎంగేజ్మెంట్ చిత్రాన్ని ఆన్ లైన్ లో పంచుకున్నారు. కాజల్ ఒక అందమైన లెహంగా ధరించగా.. మ్యాచింగ్ నెక్లెస్ తో అదరగొట్టగా.. గౌతమ్ సింపుల్ కుర్తాలో కనిపించారు.

ఇన్ స్టాలో ఈ ఫోటోకి “ఎండ్లెస్ లవ్” అని ఎమోజీతో క్యాప్షన్ చేశాడు. కాజల్ దానికి ప్రేమపూర్వక రిప్లయ్ ని ఇచ్చింది. ఈ పోస్ట్ కూడా డిజైన్ -కిచ్లు కి సంబంధించిన ఒక గొప్ప అంశాన్ని ప్రతిబింబిస్తుంది అని నర్మగర్భంగా వ్యాఖ్యను జోడించింది. గౌతమ్ ని మించి తనను ఎవరూ ప్రేమించలేరని దానర్థం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here