నిర్మాణ సంస్థ ఎస్‌విఆర్ మీడియా నిర్మాత శోభారాణి త‌న‌యుడు ర‌మ‌ణ‌ని హీరోగా ప‌రిచ‌యం చేస్తున్నారు.  ర‌విచంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో నిర్మిస్తోన్న డిఫ‌రెంట్ క్రైమ్ థ్రిల్ల‌ర్ కు `పాయిజ‌న్‌`(వ‌ర్కింగ్ టైటిల్‌) అని టైటిల్ ఫిక్స్ చేసారు.

సిమ్రన్‌, సారిక‌, అర్ఛ‌న‌, శివ‌ణ్య హీరోయిన్స్‌గా న‌టిస్తుండగా, న‌టుడు ష‌ఫీ కీల‌క పాత్ర పోషిస్తున్నారు.  ఈ చిత్రం హైద‌రాబాద్‌ సంస్థ కార్యాల‌యంలో పూజా కార్య‌క్ర‌మాల‌తో ఈ రోజు ప్రారంభ‌మైంది. తొలి స‌న్నివేశాన్ని హీరో ర‌మ‌ణ‌, హీరోయిన్స్  సిమ్రన్‌, సారిక‌, అర్ఛ‌న‌, శివ‌ణ్యలపై తెర‌కెక్కించారు ద‌ర్శ‌కుడు ర‌విచంద్ర‌న్‌.

ఈ రోజు నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకోనుంది. ఈ సంద‌ర్భంగా ఏర్పాటుచేసిన విలేఖ‌రుల స‌మావేశంలో.. చిత్ర నిర్మాత‌లు కె.శిల్పిక‌, ప్ర‌వ‌ల్లిక  మాట్లాడుతూ – ఈ క‌రోనా లాక్‌డౌన్ త‌ర్వాత  ఒక కొత్త మూవీని ఎనౌన్స్ చేయ‌డం హ్యాపీగా ఉంది.  ఈ చిత్రానికి మంచి స‌బ్జెక్ట్‌తో పాటు మంచి ఆర్టిస్టులు,టెక్నీష‌న్స్ తో కూడిన టీమ్ కుదిరింది అన్నారు.

ద‌ర్శ‌కుడు ర‌విచంద్ర‌న్ మాట్లాడుతూ – “ ఈ మూవీ ఒక డిఫ‌రెంట్ క్రైమ్ థ్రిల్ల‌ర్‌. ఫ్యాష‌న్ ఇండ‌స్ట్రీ బ్యాక్‌డ్రాప్‌లో ప్ర‌తిక్ష‌ణం ఉత్కంఠ‌భ‌రితంగా సాగుతుంది.  ఫ్యాష‌న్ ఇండ‌స్ట్రీ బ్యాక్‌డ్రాప్ క‌థ‌ కాబ‌ట్టి ఎంతో మంది  థియేట‌ర్ ఆర్టిస్టులను ఆడిష‌న్ చేసి హీరో హీరోయిన్ల‌ను ఎంచుకోవ‌డం జ‌రిగింది.  ప్ర‌ముఖ‌ ద‌ర్శకుడు బాలా గారి దగ్గ‌ర వ‌ర్క్ చేసిన సినిమాటోగ్రాఫ‌ర్ ముత్తు కుమ‌ర‌న్ గారి విజువ‌ల్స్ థ్రిల్ చేస్తాయి“అన్నారు.

హీరో ర‌మ‌ణ మాట్లాడుతూ – హీరోగా ప‌రిచ‌యం అవుతున్నందుకు ల‌క్కీగా ఫీల్ అవుతున్నాను. ఈ  అవ‌కాశం ఇచ్చినందుకు ధ‌న్య‌వాదాలు.  ప్ర‌తి ఒక్క‌రిని ఎంట‌ర్టైన్ చేస్తూనే అనుక్ష‌ణం ఉత్కంఠకు గురిచేసే స‌బ్జెక్ట్‌. నా బెస్ట్ పెర్‌ఫామెన్స్ ఇవ్వ‌డానికి ప్ర‌య‌త్నం చేస్తాను“ అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here