హీరో మంచు మనోజ్ ఇతరులకు సహాయం చేయడానికి ఎప్పుడూ ముందే ఉంటాడనే విషయం తెలిసిందే. మనకెందుకులే అని ఊరుకోకుండా అన్ని అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటారు. ముఖ్యంగా సమాజంలో మహిళపై జరుగుతున్న అకృత్యాలపై దాడులపై స్పందిస్తూ మార్పు తీసుకురాడానికి ప్రయత్నిస్తుంటాడు. నిర్భయ దిశా ఘటనలు జరిగినప్పుడు మనోజ్ ఎలా స్పందించాడో అందరం చూసాం. ఇప్పుడు తాజాగా ఒక మహిళ ఓ మీడియాకు చెందిన కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో తనకు వేధిస్తున్నారని పెట్టిన ట్వీటీకి స్పందించాడు మంచు మనోజ్.
హైదరాబాద్ కు చెందిన ఓ మహిళ ట్విట్టర్ లో తెలంగాణ రాష్ట్ర డీజీపీని ట్యాగ్ చేస్తూ తనపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయని పేర్కొంది. ఓ ప్రముఖ మీడియాకు చెందిన కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి తనను లైంగికంగా మెంటల్ గా టార్చర్ పెడుతున్నారని.. వాళ్ళు జెమిని మ్యూజిక్ ఛానెల్ కి చెందినవారని ట్వీట్ చేసింది. నా ఫోన్ లో జరిగే ప్రతి యాక్టీవిటీని తెలుసుకుని నన్ను మానసికంగా బ్లాక్ మెయిల్ చేస్తున్నారని.. ఒక వ్యక్తి ప్రైవేట్ సమాచారం తెలుసుకోవడం ఎలా సాధ్యమో నాకు తెలియదు.. ఇంతకముందు దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన నాకు న్యాయం జరగలేదు అని పేర్కొంది. ఇది చూసిన మంచు మనోజ్ సదరు మహిళకు సాయం చేసేందుకు ముందుకొచ్చారు.
”హాయ్ అమ్మా.. నీకు ఈ పరిస్థితులు ఎదురుకావడం చాలా బాధగా అనిపిస్తోంది. ఆ వ్యక్తుల వివరాలు ఫోన్ నెంబర్స్ నా ఇన్ బాక్స్ కి మెసేజ్ పెట్టండి” అని మనోజ్ ట్వీట్ చేశాడు. దీంతో మహిళకు సాయం చేయడానికి ముందుకొచ్చిన మంచు మనోజ్ ను అందరూ మెచ్చుకుంటున్నారు. అయితే మరికొందరు నెటిజన్స్ సదరు మహిళ గతంలో చేసిన ట్వీట్స్ ని స్క్రీన్ షాట్ తీసి మనోజ్ కి రిప్లై పెడుతున్నారు. ఒకప్పుడు ఆమె చేసిన ట్వీట్స్ చూడండి.. ఇలాంటి వాళ్లకు సాయం చేయకండి అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఆ మహిళ చేసిన ఆరోపణలపై సదరు టీవీ ఛానెల్ యాజమాన్యం స్పందిస్తుందేమో చూడాలి.
Hi amma… I’m sorry you are going through this… can u send me the phone numbers and details of the person harassing you to my inbox please… https://t.co/t9MTJRJfg2
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) October 13, 2020