ధూమ్ లాంటి ఛేజ్ లు, అదీ విదేశాల్లో వున్న సబ్జెక్ట్ ను తలకెత్తుకున్నారు దర్శకుడు రమేష్ వర్మ అని టాక్. గతంలో చాలా సినిమాలకు తెరవెనుక పనిచేసిన శ్రీకాంత్ అనే రచయిత తయారుచేసిన ఫ్రీమేక్ సబ్జెక్ట్ కు హీరో రవితేజ ఓకె అన్నారు.

ఇది చిన్నా చితకా వ్యవహారం కాదు. వంద రోజుల షూట్ . అది కూడా బ్యాంకాక్ లాంటి చోట భారీ ఛేజ్ లు వుంటాయని తెలుస్తోంది.

ప్రస్తుతం చేస్తున్న క్రాక్ సినిమా తరువాత ఈ సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడు హీరో రవితేజ. అయితే పోస్ట్ కరోనా నేపథ్యంలో ఈ సినిమా ఎంత వరకు సాధ్యం అన్నది అనుమానం. ఎందుకంటే విదేశాల్లో షూట్ అంటే చాలు, ఎప్పుడు అవుతుంది అన్నది అనుమానం.

అలాగే రవితేజ మీద నలభై, యాభై కోట్ల బడ్జెట్ అంటే ఎలా వుంటుంది అన్నది మరో డౌట్.  పైగా పోస్ట్ కరోనా నేపథ్యంలో మార్కెట్ ఎలా వుంటుందో తెలియదు.

నిర్మాత కోనేరు సత్యనారాయణ తలకెత్తుకున్న ఈ భారీ ప్రాజెక్టు నవంబర్ లేదా డిసెంబర్ లో ప్రారంభమయ్యే అవకాశం వుంది. ఈ సినిమా ఓ షెడ్యూలు చేసాక రవితేజ మరో సినిమా కు డేట్ లు ఇస్తున్నట్లు బోగట్టా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here