'అత్తారింటికి దారేది' హీరోయిన్ ప్రణీత పేరుతో మోసం...!
'అత్తారింటికి దారేది' హీరోయిన్ ప్రణీత పేరుతో మోసం...!

అత్తారింటికి దారేది‘ ‘రభస’ ‘బ్రహ్మోత్సవం’ ‘హలో గురూ ప్రేమ కోసమే’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన హీరోయిన్ ప్రణీత పేరు వినగానే సినీ అభిమానులకు ఆమె అందమైన కళ్ళు.. మళ్లీ మళ్లీ చూడాలనిపించే నవ్వు గుర్తొస్తాయి. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ పేరు చెప్పి బెంగుళూరులో ఓ ప్రముఖ కంపెనీకి కుచ్చుటోపీ పెట్టినట్లు తెలుస్తోంది. ఎస్వీ.గ్రూప్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ కంపెనీని నిర్వహించే అమరనాథ్ రెడ్డి అనే వ్యక్తి.. తెలుగు తమిళ కన్నడ హిందీ భాషల్లో నటించిన ప్రణీతను బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకోవాలనులుకున్నాడట. ఇది తెలుసుకున్న మహమ్మద్ జునాయత్ – వర్షా అనే ఇద్దరు వ్యక్తులు తాము హీరోయిన్ ప్రణీత మేనేజర్లమని పరిచయం చేసుకున్నారు. బెంగుళూరులోని ఓ హోటల్ లో ప్రణీత ఉన్నారని.. మీ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా డీల్ సెట్ చేస్తామని నమ్మబలికారు. అది నమ్మిన అమరనాథ్ రెడ్డి హోటల్ కు వెళ్ళాడు.

హీరోయిన్ ప్రణీత మీ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా చేయడానికి ఒప్పుకున్నారని.. మీరు డబ్బులు ఇస్తే హోటల్ గదిలో ఉన్న ప్రణీత తో అగ్రిమెంట్ పై సంతకం చేయిస్తామని ఆ ఇద్దరు వ్యక్తులు అమరనాథ్ తో చెప్పారు. వీరి మాటలు నమ్మిన అతను తన వద్ద ఉన్న రూ. 13.5 లక్షలు వారికి నగదు ఇచ్చేశాడు. అక్కడి నుంచి ఆ డబ్బుతో వారిద్దరూ మాయం అయ్యారు. ఎంత సేపటికి వారు బయటకు రాకపోవడంతో బిల్డర్ వారికి ఫోన్ చేయగా మొబైల్ స్విచ్ ఆఫ్ అని తెలిసింది. దీంతో మోసపోయాయని గ్రహించిన బిల్డర్ బెంగుళూరు హైగ్రౌండ్స్ పోలీస్ స్టేషన్ ని ఆశ్రయించాడు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మహమ్మద్ జునాయత్ – వర్షాపై కేసు నమోదు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here