హీరోల ఇళ్లకు మళ్లీ బాంబు బెదిరింపులు
హీరోల ఇళ్లకు మళ్లీ బాంబు బెదిరింపులు

తమిళనాట ఈమద్య వరుసగా బాంబు బెదిరింపు కాల్స్ ఎక్కువ అయ్యాయి. ముఖ్యంగా తమిళ స్టార్ హీరోల ఇళ్లలో బాంబులు అంటూ కొందరు ఆకతాయిలు ఫోన్ కాల్స్ చేస్తున్న కారణంగా పోలీసులు హడావుడిగా వెళ్లి బాంబు కోసం గంటల తరబడి ఇంచు ఇంచు ఇళ్లంతా కూడా జల్లెడ పట్టి చివరకు బాంబు లేదు ఏమీ లేదు అనుకుంటూ వస్తున్నారు. ఇది ఎవరు ఎందుకు చేస్తున్నారు అనే విషయం అర్థం కాక పోలీసులు జుట్టు పీక్కుంటున్నారు. తాజాగా మరో ఇద్దరు హీరోల ఇళ్లకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి.

తమిళ యంగ్ హీరో ధనుష్ మరియు సీనియర్ స్టార్ నటుడు విజయ్ కాంత్ ల ఇళ్లలో బాంబులు ఉన్నాయంటూ బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఎప్పటిలాగే బాంబు స్క్వాడ్ మరియు పోలీసులు అక్కడకి చేరుకుని గంటల తరబడి సోదాలు చేశారు. మళ్లీ ఎప్పటి మాదిరిగానే వారికి బాంబు లేదు అనే వెళ్లడయ్యింది. ఈసారి కూడా ఫేక్ కాల్స్ అంటూ నిర్థారణ అయ్యింది. బాంబు బెదిరింపు కాల్స్ ను లైట్ తీసుకోలేక ప్రతి సారి బాంబు కోసం వెదికి చివరకు లేదు అనే సమాధానం వస్తున్న నేపథ్యంలో పోలీసులు చాలా చిరాకుగా ఉన్నారట.

బాంబు బెదిరింపు కాల్స్ చేస్తున్నది ఒక్కరేనా లేదంటే పోలీసుల సహనాన్ని పరీక్షించేందుకు వేరు వేరు వారు చేస్తున్నారా అనేది ఎంక్వౌరీలో తేలాల్సి ఉంది. ఫోన్ కాల్స్ ను నెంబర్ తెలియకుండా చేస్తున్నారు అంటే ఇక్కడ ఏదైనా జరుగుతుందా లేదంటే జరుగబోతుందా అనే అనుమానాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here