CSK: ప్లాన్-బి మొదలుపెట్టనున్న ధోనీ.. కీలక మ్యాచ్‌ల్లో బరిలోకి రహస్య అస్త్రం!
CSK: ప్లాన్-బి మొదలుపెట్టనున్న ధోనీ.. కీలక మ్యాచ్‌ల్లో బరిలోకి రహస్య అస్త్రం!

ఐపీఎల్‌ 2020 మిడ్ సీజన్ ట్రాన్స్‌ఫర్ విండో ఓపెన్ అయ్యింది. దీని ప్రకారం ఇప్పటి వరకూ రెండు కంటే తక్కువ మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లను ఫ్రాంచైజీలు వేరే జట్ల నుంచి తీసుకోవచ్చు. గేల్, రహానే, ఇమ్రాన్ తాహిర్ లాంటి ఆటగాళ్లను ఫ్రాంచైజీలు ట్రాన్స్‌ఫర్ చేసుకునే అవకాశం ఉంది.. కాగా మిడ్ సీజన్ ట్రాన్స్‌ఫర్ విండో ద్వారా ఆటగాళ్ల బదిలీ విషయమై చెన్నై సూపర్ కింగ్స్ స్పందించింది. తామెప్పుడూ మిడ్ సీజన్ ట్రాన్స్‌ఫర్ విండో ద్వారా ఆటగాళ్లను కొనుగోలు చేయడం గానీ విక్రయించడం గానీ చేయలేదని స్పష్టం చేసింది.

‘అన్ని జట్లూ వేలం ద్వారా ఆటగాళ్లను కొనుగోలు చేశాయి.. కాబట్టి ఏ జట్టు కూడా క్యాప్డ్ ప్లేయర్‌ను ఇతర జట్లకు ఇస్తుందని అనుకోవడం లేదు’’ అని చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథన్ వెల్లడించారు. పోటీ ఎక్కువగా ఉండే ఐపీఎల్‌లో ఏ జట్టు కూడా తమ ఆటగాణ్ని వేరే జట్టుకు ఇస్తుందని భావించడం లేదన్నారు. తుది జట్టులో కొందరికి చోటు దక్కి ఉండొచ్చు.. మరి కొందరికి ఆడే అవకాశం ఇంకా రాకపోవచ్చు. కానీ రకరకాల ప్రణాళికలు, పరిస్థితుల ఆధారంగానే ఇలా జరుగుతుందని విశ్వనాథన్ చెప్పారు. జట్లు కేవలం ఒకే ప్లాన్‌తో బరిలో దిగవని.. రకరకాల ప్లాన్స్‌తో ఐపీఎల్ బరిలో దిగుతాయన్నారు.

గత సీజన్లో పర్పుల్ క్యాప్ సాధించిన ఇమ్రాన్ తాహిర్‌కు ఈ సీజన్లో చెన్నై తుది జట్టులో అవకాశం లభించడం లేదు. దీంతో అతణ్ని మిడ్ సీజన్ ట్రాన్స్‌ఫర్ ద్వారా వేరే ఫ్రాంచైజీకి బదిలీ చేస్తారేమో అనే ఊహాగానాల మధ్య సీఎస్‌కే సీఈవో ఈ వ్యాఖ్యలు చేశారు. రానున్న రోజుల్లో యూఏఈ పిచ్‌లు స్పిన్నర్లకు అనుకూలిస్తాయి కాబట్టి.. అప్పుడు తాహిర్‌ను ఆడించే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి నలుగురు విదేశీ ఆటగాళ్లలో ఇద్దరు టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ మరో ఇద్దరు బౌలింగ్ ఆల్‌రౌండర్లను ఆడిస్తున్నామని ఆయన చెప్పారు.

చెన్నై సూపర్ కింగ్స్ మిడిలార్డర్‌లో మరో ఇద్దరు ఇండియన్ బ్యాట్స్‌మెన్ ఆడేందుకు అవకాశం ఉంది. కానీ తాము ఆ దిశగా ఆలోచించడం లేదని.. ఆటగాళ్ల బదిలీకి సంబంధించిన నిబంధనలు సైతం తమకు పూర్తిగా తెలియవని ఫ్రాంచైజీ సీఈవో వెల్లడించడం గమనార్హం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here