రేపే రానున్న ఒప్పో ఏ15.. ఫీచర్లు ఇవే.. ధర రూ.10 వేల లోపేనా?
రేపే రానున్న ఒప్పో ఏ15.. ఫీచర్లు ఇవే.. ధర రూ.10 వేల లోపేనా?

ఒప్పో ఏ15 స్మార్ట్ ఫోన్‌ను కంపెనీ ఎప్పట్నుంచో టీజ్ చేస్తూనే ఉంది. అమెజాన్‌లో దీనికి సంబంధించిన ప్రత్యేక పేజీ కూడా లైవ్‌లోకి వచ్చింది. ఇప్పుడు ఈ ఫోన్ లాంచ్‌ని మనదేశంలో ప్రకటించింది. రేపు(అక్టోబర్ 15వ తేదీ) మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫోన్ మనదేశంలో లాంచ్ కానుంది.

అమెజాన్ లిస్టింగ్ ద్వారానే ఈ లాంచ్ తేదీని కూడా ప్రకటించారు. ఇందులో కేవలం బ్లూ కలర్ వేరియంట్ మాత్రమే అమెజాన్ పేజీలో చూపించారు. అయితే లాంచ్ సమయానికి మరిన్ని కలర్ ఆప్షన్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

ఒప్పో ఏ52 స్పెసిఫికేషన్లు(అంచనా)
ఈ లిస్టింగ్ ప్రకారం ఇందులో 6.52 అంగుళాల డిస్ ప్లేను అందించనున్నారు. కంటి రక్షణ కోసం ఏఐ బ్రైట్ నెస్ అనే ఫీచర్ కూడా ఇందులో ఉండనున్నట్లు తెలుస్తోంది. వినియోగదారుల వాడకం మేరకు బ్రైట్ నెస్ ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ అవుతుంది. ఈ ఫోన్ కింద భాగంలో కాస్త మందపాటి అంచును అందించారు.

ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. 13 మెగా పిక్సెల్, 2 మెగా పిక్సెల్, 2 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న మూడు కెమెరాలను ఇందులో అందించారు. దీంతోపాటు ఎల్ఈడీ ఫ్లాష్ కూడా ఉంది. కెమెరాలో ఏఐ ఫీచర్లను అందించారు. దీంతోపాటు ఫిజికల్ ఫింగర్ ప్రింట్ ఆప్షన్ కూడా ఇందులో ఉంది. కెమెరా కింద భాగంలో దీన్ని అందించారు.

లీకుల ప్రకారం ఈ ఫోన్ మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్‌పై పనిచేయనుంది. 3 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. దీన్ని మైక్రో ఎస్ డీ కార్డు ద్వారా 256 జీబీ వరకు పెంచుకోవచ్చు.

ఇందులో 4230 ఎంఏహెచ్ బ్యాటరీని అందించనున్నారు. దీని సెల్ఫీ కెమెరా సామర్థ్యం 5 మెగా పిక్సెల్‌గా ఉంది. ఆండ్రాయిడ్ 10 ఆధారిత కలర్ఓఎస్ 7.2 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. దీని మందం 0.8 సెంటీమీటర్లుగానూ, బరువు 175 గ్రాములుగానూ ఉండనుంది. ఈ స్పెసిఫికేషన్లను చూస్తే దీని ధర రూ.10 వేల లోపే ఉండే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here