నన్ను బెదిరించినా ఇంత దూరం వచ్చానన్న వింక్ గాళ్
నన్ను బెదిరించినా ఇంత దూరం వచ్చానన్న వింక్ గాళ్

వివాదంతో ప్రచారం లో కెక్కెను ఎంజాయ్ చేస్తోంది వింక్ గాళ్ ప్రియా ప్రకాష్ వారియర్. ప్రతిసారీ ఏదో ఒక వివాదంతో ఈ భామ జాతీయ మీడియా సహా అన్ని మీడియాల్లోనూ హైలైట్ అయిపోతోంది. ఇంతకుముందు శ్రీదేవి బంగ్లా ఈ అమ్మడి పేరు మార్మోగేలా చేసింది. ఒకసారి తన ఇంటిపైనా దాడికి దిగారు కొందరు. వింక్ గాళ్ ఇమేజ్ ప్రతిసారీ అదనపు అస్సెట్ అవుతోంది.
ఇటీవల నెటిజనుల నుంచి రకరకాల కోణాల్లో ట్రోలింగుకు గురవుతున్న ప్రియా ప్రకాష్ వారియర్ .. సోషల్ మీడియాల్లో ఏమాత్రం తగ్గడం లేదు. ఇటీవల తాను రివీల్ చేసిన ఫోటోషూట్లు క్షణాల్లో అంతర్జాలాన్ని షేక్ చేశాయి. తాజా చిత్రాలన్నీ ప్రియ పరివర్తన పై విస్మయం కలిగిస్తున్నాయి. ఎవ్వర్ లేటెస్ట్ ఫోటోషూట్ లో ఇటీవలే ఆమె రీగల్ రాణిలా కనిపించి కవ్వించింది.

గోధుమ రంగు లెహంగా కాంబినేషన్ చోలీలో కుర్రాళ్ల గుండెల్ని చిదిమేసే మంత్రగత్తెనే తలపిస్తోంది. తనవైన దేహశిరుల్లో అందచందాల్ని ఈ అమ్మడు ఎలివేట్ చేస్తున్న తీరు మైమరిపిస్తోంది. ఒకరకంగా చెప్పాలంటే నేచురల్ మోనాలిసానే తలపిస్తోంది.అయితే కొన్నిసార్లు ప్రియాను అవమానిస్తూ కొందరు జుగుప్సాకర వ్యాఖ్యలను చేస్తుండడమే కలచివేస్తోంది. వాటిపై స్పందిస్తూ #ItsADressNotAYes అనే హస్టాగ్ తో తన చిత్రాలకు క్యాప్షన్ ఇచ్చింది. ఆమె తన సోషల్ మీడియాలో చూసిన కొన్ని వ్యాఖ్యలను కూడా షేర్ చేసింది. “హే అబ్బాయిలు! అవి నా ఇన్ స్టాలో కొన్ని వ్యాఖ్యలు. నేను 1/4 వ్యాఖ్యలను కూడా చూడలేకపోయాను“ అని కవ్వించింది.

అయితే అలాంటి దురుసైన వ్యాఖ్యలతోనే ప్రియా తమకు చేరువ అవుతోందని బోయ్స్ భావించడమే వెరీ వెరీ బ్యాడ్. “నేను రోజూ ఈ రకమైన షేమింగ్ చూస్తున్నా.నన్ను బెదిరింపులకు గురిచేసినప్పటికీ ఇంత దూరం వచ్చినందుకు నేను గర్విస్తున్నాను. ప్రతి స్త్రీ నాలానే ఉండాలి” (sic) అనే వ్యాఖ్యను జోడించింది ప్రియా. ఈ అమ్మడు ప్రస్తుతం నితిన్ సరసన ఓ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. చంద్రశేఖర్ ఏలేటి ఆ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఒరు ఆధార్ లవ్ తర్వాత బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ పైనా ఈ అమ్మడు కన్నేసింది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here