లేడీ సూపర్ స్టార్ విజయశాంతి తానొకటి తలిస్తే..
లేడీ సూపర్ స్టార్ విజయశాంతి తానొకటి తలిస్తే..

లేడీ సూపర్ స్టార్ విజయశాంతి చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత మహేష్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. 2020 సంక్రాంతికి `సరిలేరు నీకెవ్వరు` రిలీజైంది. బాక్సాఫీస్ వసూళ్లు బావున్నా సినిమాలో కంటెంట్ యావరేజ్ అని విమర్శలొచ్చాయి. ఇందులో మహేష్ పాత్రతో పోటీపడుతూ నటించే ఫుల్ లెంథ్ రోల్ లో అవకాశం అందుకున్న విజయశాంతి తనవంతు బాధ్యతను చక్కగానే నెరవేర్చారు. మునుపటి టింజ్ తనలో కనిపించిందని క్రిటిక్స్ ప్రశంసించారు.
అయితే లేడీ బాస్ తానొకటి తలిస్తే అన్న చందంగానే అయ్యింది. విజయశాంతి కంబ్యాక్ కి సరిలేరు నీకెవ్వరు ఏమంత కలిసి రాలేదనే భావించాల్సి వస్తోంది. ఈ మూవీ తర్వాత వరుసగా చిరంజీవి .. బాలయ్య.. ఎన్టీఆర్ .. ప్రభాస్ సినిమాల్లోనే విజయశాంతికి ఆఫర్స్ వస్తాయని భావించారు. కానీ సీన్ చూస్తుంటే అలాంటిదేమీ కనిపించడం లేదని గుసగుసలు వేడెక్కిస్తున్నాయ్. కేవలం మీడియం రేంజ్ సినిమాల్లో ఆఫర్స్ వస్తున్నాయి కానీ.. పెద్ద హీరోల సినిమాల్లో మాత్రం ఈ లేడీ సూపర్ స్టార్ కి ఆఫర్స్ రావడం లేదని తెలిసింది.

అయితే విజయశాంతి కూడా వ్యక్తిగతంగా చాలా రిజర్వ్ డ్ గా సెలక్టివ్ గానే ఉంటున్నానని ఇంతకుముందు ఇంటర్వ్యూల్లో చెప్పారు. మహేష్ మూవీలో ఆఫర్ అనగానే.. తాను వెంటనే అంగీకరించలేదని తన పాత్ర రేంజును బట్టి అంగీకరించానని తెలిపారు. అయితే అదే రేంజు పాత్రల్ని రాసేందుకు దర్శకరచయితలు సిద్ధంగా లేకపోవడమే విజయశాంతికి ఆఫర్స్ రావడం లేదా? అన్నది తేలాల్సి ఉంది. విజయశాంతి కంటే ముందు చాలా గ్యాప్ తర్వాత వచ్చినా నదియా జెట్ స్పీడ్ తో దూసుకుపోయారు. కానీ విజయశాంతికి ఇప్పుడలా లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here