తెలంగాణలో ప్రమాదపుటంచున విద్యుత్ గ్రిడ్!
తెలంగాణలో ప్రమాదపుటంచున విద్యుత్ గ్రిడ్!

విద్యుత్ పంపిణీ అనేది చాలా జఠిలమైన వ్యవస్థ. విద్యుత్ డిమాండ్ పెరిగినా విద్యుత్ గ్రిడ్ కుప్పకూలుతుంది? కరెంట్ ఆగిపోతుంది.. పోనీ విద్యుత్ డిమాండ్ పడిపోయినా కూడా అదే డేంజర్ నెలకొంటుంది. అందుకే అత్యవసర వ్యవస్థగా విద్యుత్ సిబ్బంది అధికారులు ఎంతో అప్రమత్తంగా వ్యవహరించాలి. లేకుంటే గ్రిడ్ కుప్పకూలి మొత్తం అంధకారమవుతుంది. ప్రస్తుతం అదే పరిస్థితి నెలకొంది.

తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా విద్యుత్ డిమాండ్ పతనమై గ్రిడ్ ప్రమాదంలో పడింది. మంగళవారం పగలు 5803 మెగావాట్ల డిమాండ్ రికార్డ్ అవ్వగా.. అర్థరాత్రి అత్యల్పస్థాయికి పడిపోయింది.

నిన్న అర్థరాత్రి భారీ వర్షాల కారణంగా అంతటా కరెంట్ పోయి.. చాలా మంది విద్యుత్ వినియోగించకపోవడంతో ఏకంగా 2809 మెగావాట్లకు డిమాండ్ పడిపోయింది. దీంతో విద్యుత్ అధికారులు హైరానా పడ్డారు.

విద్యుత్ ఉత్పత్తి వినియోగం మధ్య సమతూకం లేకపోతే గ్రిడ్ కుప్పకూలిపోయే ప్రమాదం ఉంటుంది. డిమాండ్ లో హెచ్చు తగ్గులున్నా కూడా గ్రిడ్ ను పరిరక్షించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్ రావు తెలిపారు. దీంతో ప్రస్తుతం వర్షాల వేళ విద్యుత్ పంపిణీ అనేది అధికారులకు కత్తిమీద సాములా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here