ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ జోరు ఏ మాత్రం తగ్గడంలేదు. ప్రతిరోజూ కూడా వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఇక రాష్ట్రంలో సామాన్యుల నుండి ప్రముఖుల వరకు ప్రతి ఒక్కరు కూడా కరోనా భారిన పడుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే పలువురు మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు కరోనా భారిన పడిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా వైసీపీ కీలక నేత టీటీడీ ఛైర్మెన్ వై వి సుబ్బారెడ్డి కి కరోనా పాజిటివ్ గా తేలినట్టు ప్రసారమాధ్యమాల్లో ఓ వార్త ప్రచారం అవుతుంది.

ప్రస్తుతం అయన  హైదరాబాద్ లోని ఓ ప్రముఖ హాస్పటల్ లో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి అయన ఆరోగ్యం బాగుంది అని తెలుస్తుంది. ఇకపోతే ఇటీవల నిర్వహించిన టీటీడీ సమావేశంలో వైవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. దీంతో ఆయనను కలిసిన వారిలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నెల 12న వైవీ సుబ్బారెడ్డి తల్లి పిచ్చమ్మ జన్మదినం జరిగింది. ఆ వేడుకల్లోనూ ఆయన పాల్గొని తల్లి ఆశీర్వాదం తీసుకున్నారు. వైవీ సుబ్బారెడ్డికి కరోనా సోకినట్లు నిర్ధారణ కావడంతో ఆయన తల్లి ఆరోగ్యంపై సైతం ఆందోళన వ్యక్తం అవుతుంది.

ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఇటీవల కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. అయితే ఆయనకు ఇంకా కరోనా తగ్గలేదు. దీంతో ఆయనను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని అపోలో ఆస్పత్రికి తరలించారు.  కరోనా సోకి 14 రోజులు గడిచినా కూడా ఇంకా కోలుకోలేకపోవడంతో మెరుగైన చికిత్స కోసం ఆయన్ని హైదరాబాద్ కి తరలించారు. ఇకపోతే తాజాగా ఏపీలో 3892 కోవిడ్ 19 కేసులు నమోదైనట్లు ప్రభుత్వం నిన్న విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 767465కి చేరింది. ఇక రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో 32 మంది కరోనాతో చనిపోయారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 6319కి పెరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here