విజయవాడలో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. ఇంజినీరింగ్ విద్యార్థిని దివ్య తేజస్విని గొంతుకోశాడు. తీవ్ర గాయాల పాలైన దివ్య తేజస్విని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. కొంతకాలంగా ప్రేమ పేరుతో దివ్య తేజస్వినిని స్వామి అనే యువకుడు వేధింపులకు గురి చేశాడు. ప్రేమను నిరాకరించిందని యువతి ఇంటికి వెళ్లిన స్వామి ఆమెపై కత్తితో దాడి చేశాడు. దాడి తర్వాత కత్తితో తనను తాను గాయపర్చుకున్నాడు. మాచర్ల పీఎస్ పరిధిలోని క్రీస్తురాజపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
తేజస్వినిపై కత్తితో దాడిచేసిన నాగేంద్రబాబు ఆత్మహత్యకు యత్నించాడు. తనను తాను కత్తితో పొడుచుకున్నాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతన్ని గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. నాగేంద్రబాబు పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందని జీజీహెచ్ వైద్యులు తెలిపారు. చికిత్స అందిస్తున్నామని.. పూర్తి వివరాలు తెలియజేస్తామన్నారు.